E-Paper
Advertisement

Election Results: కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్న ఎన్డీఏ.. మిగతా పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చాయంటే..?

Election Results: కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్న ఎన్డీఏ.. మిగతా పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చాయంటే..?
Advertisement

Lok Sabha Election Results updates(Politics news today India): బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్నది. 18వ లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ మార్క్ ను దాటింది. తాజా సమాచారం ప్రకారం.. 296 స్థానాల్లో ఎన్డీఏ కూటమి, 232 స్థానాల్లో ఇండియా కూటమి, ఇతరులు – 19 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు.

అయితే, 2019లో ఒంటరిగానే 303 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి మాత్రం తక్కువ సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈసారి యూపీలో సమాజ్ వాదీ పార్టీ ఊహించని రీతిలో పుంజుకున్నది. ఆ పార్టీకి తాజా సమాచారం ప్రకారం 36 సీట్లు వచ్చాయి. ఇటు బెంగాల్ లో కూడా బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 31 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్నది.

Advertisement

కాగా, యూపీ అందరి అంచనాలను తలకిందులు చేసింది. 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 2019లో దాదాపు చాలా స్థానాలను నిలబెట్టుకున్నది. కానీ, ఈసారి మాత్రం అక్కడ అనూహ్య రీతిలో సమాజ్ వాదీ పార్టీ పుంజుకుని అనూహ్య రీతిలో సత్తా చాటింది. మొత్తం 80 స్థానాలను కలిగి ఉన్న ఆ రాష్ట్రంలో తాజా సమాచారం ప్రకారం.. ఎస్పీ 35 స్థానాలు, బీజేపీ 34 స్థానాల్లో, కాంగ్రెస్ ఏడు స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఇక్కడ హోరాహోరీ ఉంటుందని భావించిన బీజేపీ కేవలం 10 సీట్లలో మాత్రమే లీడింగ్ లో ఉన్నది. ఇటు తృణమూల్ కాంగ్రెస్ 31 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నది.

Advertisement

2019 లోక్ సభ ఎన్నికల్లో కేవలం 52 సీట్లలో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈసారి సెంచరీ కొట్టబోతున్నది. తాజా సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రాంతీయ పార్టీలు అయినటువంటి సమాజ్ వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు చాలా సీట్లను గెలవబోతున్నాయి. ఇటు శివసేన థాకరే, ఎన్సీపీ, లోక్ జనశక్తి పార్టీలు పలు స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి.

Also Read: విపక్షాలపై స్వల్ప ఆధిక్యంలో ఎన్డీఏ.. మోదీ రాజీనామాకు మమతా డిమాండ్

అయితే, ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓడిపోయారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కొడుకు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతోపాటు పలువురు ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×