E-Paper
Advertisement

Sabarimala: శబరిమలలో మళ్లీ రచ్చ.. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి, రంగంలోకి పోలీసులు

Sabarimala: శబరిమలలో మళ్లీ రచ్చ..  తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి, రంగంలోకి పోలీసులు
Advertisement

Sabarimala: కేరళలోని శబరిమల ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లోకి వస్తోంది. అక్కడికి వెళ్లిన అయ్యప్ప భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తెలుగు వ్యక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేయడం కలకలం రేపింది. ఈ విషయం తెలియగానే పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇంతకీ అసలు అక్కడేం జరిగింది?

శబరిమలలో మళ్లీ రచ్చ

Advertisement

శుక్రవారం శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగు భక్తులపై అక్కడి వ్యాపారులు దాడులు చేస్తున్నారు. ఓ షాపు ఓనర్.. గాజు సీసాతో అయ్యప్ప భక్తుడి తల పగలగొట్టడం మళ్లీ రచ్చగా మారింది. వాటర్‌ బాటిల్‌ ధర ఎక్కువ ఉందని ప్రశ్నించడమే ఆ భక్తుడి తప్పయ్యింది. దీనిపై తెలుగు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో షాపు వద్ద నిల్చుని అయ్యప్ప భక్తులు నిరసన తెలిపారు. షాపు వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన తెలిపారు. స్థానిక మిగతా షాపుల ఓనర్లు భక్తులపై ఎదురు తిరిగారు. దీనిపై ఏపీ-తెలంగాణకు చెందిన తెలుగు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని భక్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

Advertisement

తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి

భక్తులను, వ్యాపారులను అక్కడిని పంపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో స్థానిక వ్యాపారస్తులకు పోలీసులు మద్దుతుగా ఉండటాన్ని మండిపడుతున్నారు. ఈ  వ్యవహారానికి  సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.  ప్రతీ ఏడాది ఈ సీజన్‌‌లో శబరిమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు అధికంగా ఉంటారు.

శబరిమలలో రద్దీ అనుగుణంగా అక్కడి అధికారులు ఏర్పాట్లు చేయలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి కనీస సౌకర్యాలు సరిగా లేవని, స్థానికులు మర్యాదగా ప్రవర్తించడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇటీవల పోలీసు అధికారి తెలుగు భక్తులు అసభ్యకరంగా మాట్లాడారు. తాజాగా ఇప్పుడు స్థానిక వ్యాపారులు దాడి వంతైంది.

ALSO READ: రష్యా అధ్యక్షుడు పుతిన్ బస అక్కడే.. ఒక్కరాత్రికి ఎంతో తెలుసా?

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×