E-Paper
Advertisement

Allahabad High Court: పెళ్లైన మగవారు.. పరాయి స్త్రీతో సహజీవనం చేయవచ్చు.. హైకోర్టు సంచలనం

Allahabad High Court: పెళ్లైన మగవారు.. పరాయి స్త్రీతో సహజీవనం చేయవచ్చు.. హైకోర్టు సంచలనం
Advertisement

Allahabad High Court: వివాహితుడైన పురషుడు.. మరొక స్త్రీతో సహజీవనం చేయడం చట్టరీత్యా నేరం కాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. వయోజన మహిళతో పరస్పర అంగీకారంతో లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో (సహజీవనం) ఉండటం తప్పేమి కాదని అభిప్రాయపడింది. సామాజిక నైతికత కంటే చట్టమే ప్రాధాన్యత కలిగి ఉంటుందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

హైకోర్టు ఇంకా ఏం చెప్పిందంటే?

మహిళ కుటుంబం నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న ఓ సహజీవన జంటకు సంబంధించిన కేసుపై శుక్రవారం అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ జె.జె. మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివాహితుడైన పురుషుడు.. స్త్రీ అంగీకారంతో సహజీవనం చేస్తే అతడిపై ఎలాంటి నేరం మోపడానికి ఆస్కారం లేదని ధర్మాసనం పేర్కొంది. నైతికతను, చట్టాన్ని వేర్వేరుగా చూడాల్సిన అవసరముందని నొక్కి చెప్పింది. ‘చట్టం ప్రకారం ఏదైనా చర్య నేరం కానప్పుడు కేవలం సామాజిక అభిప్రాయాలు లేదా నైతిక విలువల ఆధారంగా కోర్టులు నిర్ణయాలు తీసుకోలేవు’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది.

వారి రక్షణ.. పోలీసుల బాధ్యత

Advertisement

ఇద్దరు వయోజనులు (Adults) తమ ఇష్టానుసారం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు వారి ప్రాథమిక హక్కులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉంటుందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. మహిళ కుటుంబం నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ.. ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. వారిద్దరికి రక్షణ కల్పించడం మీ బాధ్యత అంటూ పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సహజీవనం చేస్తున్న జంటకు తక్షణమే రక్షణ కల్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 8వ తేదీకి డివిజన్ బెంచ్ వాయిదా వేసింది.

అసలేంటీ ఈ కేసు?

షానజహాన్‌పూర్‌కు చెందిన అనామిక, నేత్రపాల్ అనే సహజీవనం చేస్తున్న జంట.. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఇటీవల అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. మహిళ కుటుంబ సభ్యులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లారని.. తనకు వివాహం జరగడంతో తప్పుడు కేసులు పెడుతున్నారని నేత్రపాల్ ధర్మాసనం ఎదుట వాపోయారు. మరోవైపు మహిళ సైతం తాను మేజర్ అని.. తన ఇష్టపూర్వకంగానే నేత్రపాల్ తో ఉంటున్నానని కోర్టుకు తెలియజేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న డివిజన్ బెంచ్.. ఆ జంటను అరెస్ట్ చేయకూడదని ఆదేశిస్తూ.. రక్షణ సైతం కల్పించాలని పోలీసులకు సూచించింది.

Advertisement

Also Read: Best Window ACs: ఏమి ఎండలు బాబోయ్? ఈ బడ్జెట్ ఏసీలు ట్రై చేయ్ భయ్యా.. సమ్మర్‌లో కూల్‌గా ఉండొచ్చు!

వ్యక్తుల స్వేచ్ఛకే పెద్ద పీట..

గతంలో కూడా సుప్రీంకోర్టు సహజీవనం నేరం కాదని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లికాని యువతి యువకుల్లో పెరిగిపోతున్న డేటింగ్ కల్చర్ ను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. తాజాగా అలహాబాద్ హైకోర్టు.. ఏకంగా పెళ్లైన మగవారు సహజీవనం చేయడం చట్ట విరుద్దం కాదని తీర్పు ఇవ్వడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. మనుషుల వ్యక్తిగత నిర్ణయాలకు సంబంధించి సామాజిక కట్టుబాట్ల కంటే రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకే ఎక్కువ విలువ ఉంటుందని ఈ తీర్పు మరోసారి చాటిచెప్పింది.

Also Read: Gas Free Kitchen: గ్యాస్ లేకుండా వంట చేయడం ఎలా? ఇదేమి కష్టం కాదండోయ్.. చాలా ఈజీగా చేసేయోచ్చు!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×