E-Paper
Advertisement

Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ఐదుగురికి బెయిల్

Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ఐదుగురికి బెయిల్
Advertisement

Liquor scam: సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఊరట లభించింది. నిందితులు సమీర్ మహేంద్రు, ముత్తా గౌతమ్, కుల్‌దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరుణ్ రాంచంద్రన్‌ పిళ్లైలకు రెగ్యులర్ బెయిల్ లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగపాల్ వారికి బెయిల్ మంజూరు చేశారు. వీరిలో కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్‌లు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్లో మాజీ ఉద్యోగులు.

ఇక బెయిల్ లభించినప్పటికీ సమీర్ మహేంద్రు ఇంకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. సీబీఐ విచారిస్తున్న కేసుకు సంబంధించి బెయిల్ వచ్చినప్పటికీ.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన జ్యూడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.

Advertisement

అలాగే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను కూడా సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆయనకు ఐదురోజుల రిమాండ్ విధించిది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సిసోడియా సుప్రీం కోర్టను ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు నిరాశే ఎదురైంది. సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేయాలనుకుంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×