// // CPI CPM VCK Support TVK: ఎట్టకేలకు విజయ్ సాధించాడు.. ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్, ఇక దళపతి సీఎం అయినట్టే..! -->
E-Paper
Advertisement

ఎట్టకేలకు విజయ్ సాధించాడు.. ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్, ఇక దళపతి సీఎం అయినట్టే..!

ఎట్టకేలకు విజయ్ సాధించాడు.. ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్, ఇక  దళపతి సీఎం అయినట్టే..!
Advertisement

CPI CPM VCK Support TVK: తమిళనాడు రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి మద్దతు ప్రకటించేందుకు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలతో పాటు విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) సుముఖత వ్యక్తం చేశాయి. విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఈ పార్టీలు మద్దతు ఇస్తాయనే వార్తలతో తమిళ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మొత్తం 234 స్థానాలు ఉన్న అసెంబ్లీలో టీవీకే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ప్రస్తుత గణాంకాల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా టీవీకే కేవలం పది స్థానాల దూరంలో నిలిచింది. మరోవైపు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ద్రావిడ పార్టీలు ఈసారి భారీగా వెనుకబడ్డాయి. డీఎంకే (DMK) కేవలం 59 స్థానాలకే పరిమితం కాగా ఏఐఏడీఎంకే (ADMK) 47 స్థానాలను గెలుచుకుంది. ఇతర పార్టీల్లో కాంగ్రెస్ 5 స్థానాలు సాధించగా వీసీకే, సీపీఎం, సీపీఐ పార్టీలు చెరో రెండు స్థానాల్లో విజయం సాధించాయి. ఇప్పుడు ఈ చిన్న పార్టీల మద్దతుతో టీవీకే బలం ఖచ్చితంగా 118కి చేరనుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడితే తమిళనాడులో దశాబ్దాల ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి తెరపడి సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలవ్వడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

ఈ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చెన్నైలోని టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. తమ పార్టీకి వామపక్షాలు, వీసీకే మద్దతు ఇస్తున్నాయనే సమాచారంతో టీవీకే కార్యకర్తలు మరియు విజయ్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. పార్టీ కార్యాలయం వెలుపల బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. ‘దళపతి’ విజయ్ ముఖ్యమంత్రి కావాలంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోతోంది. టీవీకే కార్యకర్తలు విజయ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Read Also: మంచి జరుగుతుంది.. విజయం ఖాయం, టీవీకే చీఫ్ విజయ్ మెసేజ్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×