E-Paper
Advertisement

Landslides in Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి ప్రకృతి ప్రకోపం..!

Landslides in Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి ప్రకృతి ప్రకోపం..!
Advertisement

Landslides in Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి ప్రకృతి ప్రకోపం చూపించింది. కులూ జిల్లాలోని మణికరన్ సాహిబ్ గురుద్వారా సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా బలమైన గాలులు వచినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.

వ్యూ బాగుంటుండటంతో చాలా మంది పర్యటకులు తమ కార్లను ఆపి ఫోటోలు దిగుతున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో కొండచరియలు విరిగిపడటం వల్ల ఓ భారీ వృక్షం వారిపై పడటంతో ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ టీంని ప్రమాదం జరిగిన స్థలానికి పంపించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు ఇంకా తెలియలేదని అధికారులు వెల్లడించారు.

Advertisement

కాగా కొద్ది రోజుల క్రితం కూడా హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగి పడ్డ విషయం తెలిసిందే. ఒక్కసారిగా కొండచరియలు విరిగి పడడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×