E-Paper
Advertisement

Simultaneous Polls : జమిలి ఎన్నికలపై అభిప్రాయ సేకరణ.. ప్రజల నుంచి ఐదు వేల సూచనలు..

Simultaneous Polls : జమిలి ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు 5వేలకు పైగా సూచనలు అందాయి. ఒకే దేశం – ఒకే ఎన్నికపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ కమిటీ చర్యలు ప్రారంభించింది.

ఈ క్రమంలోనే ప్రజల నుంచి సలహాలు, సూచనలను కమిటీ ఆహ్వానించింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వేలాది మంది ప్రజలు తమ సూచనలను పంపిస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు 5వేలకు పైగా ఈ-మెయిళ్లు వచ్చినట్లు పేర్కొన్నాయి.

Advertisement

దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేలా.. ప్రస్తుతం ఉన్న చట్టపరమైన అడ్మినిస్ట్రేటివ్‌ ఫ్రేమ్‌వర్క్‌లో తగిన మార్పులను సూచించాలని కోవింద్‌ కమిటీ ఇటీవల ఓ ప్రకటనలో కోరింది. జనవరి 15లోగా ప్రజలు తమ సలహాలు, సూచనలు పంపవచ్చని వెల్లడించింది. ఈ సూచనలను కమిటీ వెబ్‌సైట్‌ onoe.gov.inలో పోస్ట్ చేయాలని లేదా sc-hlc@gov.in ఐడీకి ఈ-మెయిల్‌ చేయాలని తెలియజేసింది.

ఒకే దేశం- ఒకే ఎన్నిక కోసం 2023 సెప్టెంబర్ లో ఈ కమిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి రెండుసార్లు సమావేశాలను నిర్వహించింది. ఇటీవల కమిటీ ఆరు జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. జమిలి ఎన్నికల నిర్వహణపై న్యాయ కమిషన్‌ నుంచి కూడా సలహాలు తీసుకుంది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×