E-Paper
Advertisement

BJP Formation Day : మళ్లీ మాదే అధికారం.. కాంగ్రెస్ పతనం ప్రారంభం : కిషన్ రెడ్డి

BJP Formation Day : మళ్లీ మాదే అధికారం.. కాంగ్రెస్ పతనం ప్రారంభం : కిషన్ రెడ్డి
Advertisement

Kishan Reddy Speech in BJP Formation Day 2024(Today’s State News) : మే 13న తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 10కి పైగా ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లలో గెలిచి.. మళ్లీ కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Also Read : టిప్పర్ బోల్తా.. మట్టిలో కూరుకుపోయి ముగ్గురు దుర్మరణం

రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, రోజురోజుకూ కనుమరుగవుతోందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని జోస్యం చెప్పారు. ప్రపంచ నాయకుడిగా ప్రధాని నరేంద్రమోదీ గుర్తింపు పొందారని కొనియాడారు. ఇప్పుడు యావత్ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందన్నారు.

Advertisement

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణకు రాహుల్ గాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయలేదని, అలాంటపుడు రాష్ట్రానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. హామీలను అమలు చేయకుండా.. పెద్ద పెద్ద ప్రకటనలు, సభలు మాత్రం పెడుతున్నారని దుయ్యబట్టారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×