E-Paper
Advertisement

Kerala Doctor Suicide | కట్నం కారు ఇవ్వలేదని పెళ్లి రద్దు.. యువ డాక్టర్ ఆత్మహత్య

Kerala Doctor Suicide | పెళ్లికొడుకు కుటుంబం అధిక కట్నం డిమాండ్ పూర్తిచేయలేక యువ డాక్టర్ తన జీవితాన్ని అంతం చేసకుంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. కేరళలోని తిరువనంతపురం మెడికల్ కాలేజీలో డాక్టర్ కోర్సు చదువుతున్న షహానా(26) అనే యువతి అదే కాలేజీలో ఉద్యోగం చేసే మరో డాక్టర్‌ రువైజ్‌ను ప్రేమించింది. వారిద్దరికీ వివాహం కూడా నిశ్చయమైంది. రువైజ్ కేరళ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా.

కానీ పెళ్లికి ముందు వరుడి కుటుంబ సభ్యులు 15 ఎకరాల భూమి, 1200 గ్రాముల బంగారం, ఒక BMW కారు కట్నం రూపంలో అడిగారు. ఇంత భారీ కట్నం ఇచ్చే స్థోమత తమకు లేదని పెళ్లికూతురు కుటుంబ సభ్యులు చెప్పడంతో వరుడి ఫ్యామిలీ సంబంధం రద్దు చేసింది. షహానీ తండ్రి దుబాయ్ పనిచేస్తూ కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయారు.

Advertisement

కానీ డాక్టర్ షహానా తన ప్రియుడిని మర్చిపోలేక, వివాహం ఇక జరగదని తెలిసి మనస్తాపం చెందింది. సోమవారం రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఆమె గది నుంచి ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన ఓ లెటర్ దొరికింది.
ఈ ఘటన తరువాత డాక్టర్ షహానా కుటుంబం.. వరుడి కుటుంబంపై కట్నం వేధింపు కేసు నమోదు చేసింది. దీంతో డాక్టర్ రువైజ్‌ని డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ప్రస్తుతం డాక్టర్ రువైజ్‌ని పోలీసులు అరెస్టు చేసి.. ఆయనపై కట్నం వేధింపుల కేసు నమోదు చేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×