E-Paper
Advertisement

కేరళం సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం.. మరో 20 మంది మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు-సీఎంలు హాజరు

కేరళం సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం.. మరో 20 మంది మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు-సీఎంలు హాజరు
Advertisement

Thiruvananthapuram: కేరళం ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణం చేశారు వీడీ సతీశన్‌. గవర్నర్ ఆర్లేకర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి సతీశన్‌తోపాటు, కేబినెట్‌లో మంత్రులుగా మరో 20 మంది ప్రమాణ స్వీకారం చేశారు. యూడీఎఫ్‌ కూటమి పార్టీలతో చర్చల తర్వాత మంత్రి పదవులను ఖరారు చేయనున్నారు సీఎం.

కేరళం సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

Advertisement

ఎట్టకేలకు కేరళంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర కొత్త సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దం పాటు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న కేరళ, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది.

మొత్తం 140 సీట్లకు గాను యూడీఎఫ్ 102 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సరిగ్గా ఉదయం 10 గంటలకు కేరళం సీఎంగా వీడీ సతీశన్ చేత గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత మరో 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement

మరో 20 మంది మంత్రులు..  కాంగ్రెస్ అగ్రనేతలు-సీఎంలు హాజరు

ఈ కార్యక్రమానికి కేరళంలోని విపక్షాలైన కమ్యూనిస్టులు, బీజేపీ నేతలు, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు డీకే శివకుమార్, భట్టి విక్రమార్కతోపాటు మిగతా నేతలు హాజరయ్యారు.

సతీశన్ కేబినెట్‌లో 14 మంది తొలిసారి మంత్రులు కాబోతున్నారు. వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు ఎస్సీ వర్గానికి చెందినవారు ఉన్నారు. మంత్రి పదవులు స్వీకరించిన వారిలో సీనియర్‌ నేతలు రమేశ్‌ చెన్నితాల, మురళీధరన్, అనిల్‌ కుమార్, సన్నీ జోసెఫ్‌లు ఉన్నారు. దాదాపు ఆరు దశాబ్దాల్లో ముఖ్యమంత్రితోపాటు మొత్తం మంత్రివర్గం ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి.

ALSO READ: సీఎం విజయ్‌పై నాకు కడుపు మంట లేదు.. మౌనం వీడిన నటుడు రజినీకాంత్

ఐయూఎంఎల్‌కు చెందిన ఐదుగురిని మంత్రి పదవులు దక్కాయి. వారిలో కున్హల్‌ కుట్టి, శంషుద్దీన్, షాజీ, బషీర్, అబ్దుల్‌ గఫూర్‌లు ఉన్నారు. ఈ విషయాన్ని ఐయూఎంఎల్‌ అధినేత తంగల్‌ వెల్లడించారు. రాధాకృష్ణన్‌ స్పీకర్‌గా, షనిమోల్‌ ఉస్మాన్‌ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించనున్నట్లు కేరళ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఐదేళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా పని చేసిన సతీసన్, కేరళలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి పునర్నిర్మించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 63 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 140 మంది సభ్యులున్న సభలో యూడీఎఫ్ కూటమి 102 స్థానాలు గెలుచుకుంది. దీంతో సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ దశాబ్ద పాలనకు తెరపడింది.

 

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×