// // Kerala Bus Accident: డివైడర్‌ను ఢీ కొట్టి గాల్లో లేచి పడ్డ బస్సు.. సీసీటీవీ విజువల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే! -->
E-Paper
Advertisement

డివైడర్‌ను ఢీ కొట్టి గాల్లో లేచి పడ్డ బస్సు.. సీసీటీవీ విజువల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

డివైడర్‌ను ఢీ కొట్టి గాల్లో లేచి పడ్డ బస్సు.. సీసీటీవీ విజువల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Kerala Bus Accident: కేరళలోని మలప్పురం జిల్లా కుట్టిపురం వద్ద నేషనల్ హైవే 66పై ఓ భయానక బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ నుంచి కోజికోడ్ వైపు వేగంగా వెళ్తున్న బస్సు, భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయింది. రహదారి తడిగా ఉండటంతో డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ, బస్సు అదుపుతప్పి జారుకుంటూ వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న డివైడర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాద ధాటికి అక్కడ పార్క్ చేసి ఉన్న ఒక కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. తీవ్రంగా జరిగిన ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, దాదాపు 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానికులు, పోలీసులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Advertisement

ఈ ప్రమాదానికి సంబంధించిన భయంకరమైన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. బస్సు రోడ్డుపై జారుకుంటూ వచ్చి డివైడర్‌ను ఢీకొట్టిన తీరు చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×