E-Paper
Advertisement

Kerala Election Results Live Updates: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. యుడిఎఫ్ జోరు.. తడబడిన అధికార ఎల్‌డిఎఫ్

Kerala Election Results Live Updates: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. యుడిఎఫ్ జోరు.. తడబడిన అధికార ఎల్‌డిఎఫ్
Advertisement

Kerala Election Results Live Updates: కేరళ శాసనసభకు జరిగిన ఓట్ల లెక్కంపు కొనసాగుతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో లీడ్ సాధించిన యూడీఎఫ్, అదే జోరు కొనసాగిస్తోంది. ఉదయం 9.30 గంటలకు తొలి ట్రెండ్స్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా యూడీఎఫ్ జోరు కొనసాగుతోంది.

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. తొలి ట్రెండ్స్‌లో యుడిఎఫ్ జోరు

Advertisement

స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అయితే కీలక నియోజకవర్గాల్లో ఎల్‌డీఎఫ్ స్వల్ప తేడాతో వెనుకబడ్డారు. దీంతో హోరాహోరీ తప్పదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్రాలవారీగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ట్రెండ్‌ బట్టి యూడీఎఫ్-91 నియోజకవర్గాల్లో ఆధిక్యం కొనసాగుతోంది.

అధికార ఎల్‌డీఎఫ్ 44 స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది. గట్టి పోటీ ఇస్తుందని భావించిన బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తే.. పలువురు మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో వెనుకబడ్డారు. యూడీఎఫ్ మొత్తం మీద ఆధిక్యం సాధించింది.

Advertisement

తొలి ట్రెండ్స్‌లో యుడీఎఫ్ జోరు.. తడబడిన అధికార ఎల్‌డీఎఫ్ 

రాజధాని తిరువనంతపురం, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, మలప్పరం, కోజికోడ్, వయనాడ్ జిల్లాలో స్పష్టమైన ఆధిక్యంలో యూడీఎఫ్ అభ్యర్థులు కొనసాగుతున్నారు. అధికార ఎల్‌డీఎఫ్ విషయానికి వస్తే.. కాసరగాడ్, కన్నూర్, పాలక్కాడ్, త్రిశూర్, అలప్పుజ, పత్తనమ్‌తిట్ట, కొల్లాం కాస్త లీడ్‌లో ఉంది.

ట్రెండ్ అంచనా వేసిన రాజకీయ పరిశీలకులు.. యూడీఎఫ్ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశారు. 140 సీట్లున్న కేరళ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 71 స్థానాలు.  వెలువడుతున్న ఫలితాల్లో యూడీఎఫ్ జోరు కొనసాగుతోంది. 90 సీట్లపైగానే దూసుకుపోతోంది. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.  10 సీట్లు తగ్గినా 80 సీట్లు ఖాయమన్నది కాంగ్రెస్ నేతల మాట.

ALSO READ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్..  కమలం దూకుడు, వెనుకబడుతున్న అధికార టీఎంసీ!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×