E-Paper
Advertisement

Karur Stampede : విజయ్ ఇచ్చిన రూ.20 లక్షల పరిహారం తిరస్కరించిన మృతుడి భార్య!

Karur Stampede : విజయ్ ఇచ్చిన రూ.20 లక్షల పరిహారం తిరస్కరించిన మృతుడి భార్య!
Advertisement

Karur stampede: గత నెల(సెప్టెంబర్) 27న తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందగా, దాదాపు 100 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. 41 మంది మృతుల కుటుంబాలకు విజయ్ ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారాన్ని అందజేశారు.

ఈ ఘటనలో మరణించిన రమేష్ భార్య శంకవి పెరుమాళ్, నటుడు విజయ్ అందించిన రూ. 20 లక్షల ఆర్థిక సహాయాన్ని తిరస్కరించారు. ఈ మొత్తాన్ని ఆమె ఆర్‌టీజీఎస్ ద్వారా వెనక్కి పంపించారు.

Advertisement

READ ALSO: Dhaka plot to kill Modi: మోదీపై అమెరికా భారీ కుట్ర.. చివరి నిమిషంలో హెచ్చరించిన పుతిన్?

తొక్కిసలాటలో 41 మంది మరణించగా, విజయ్ మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అయితే, బాధితులను పరామర్శించడానికి విజయ్ నేరుగా కరూర్‌కు రాకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని శంకవి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

“విజయ్.. కరూర్ వచ్చి మమ్మల్ని పరామర్శిస్తారని భావించాను. కానీ దానికి బదులుగా, సోమవారం మమ్మల్ని మామల్లపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు పిలిపించారు. నాకు తెలియకుండానే నా భర్త కుటుంబ సభ్యులను టీవీకే నేతలు అక్కడికి తీసుకెళ్లారు. ఆయన కరూర్ రాకపోవడం నన్ను బాధించింది, అందుకే ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాను” అని శంకవి స్పష్టం చేశారు.

ఈ ఘటన సోమవారం మామల్లపురంలో విజయ్ బాధితుల కుటుంబాలను కలుసుకున్న రోజే జరగడం గమనార్హం. అయితే, శంకవి నిర్ణయం వెనుక స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండవచ్చని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×