E-Paper
Advertisement

Jail: జైలుకి సరఫరా చేసే అరటిలో సిగరెట్లు-గంజాయి, షాకైన అధికారులు, అసలేం జరిగింది?

Jail: జైలుకి సరఫరా చేసే అరటిలో సిగరెట్లు-గంజాయి, షాకైన అధికారులు, అసలేం జరిగింది?
Advertisement

Jail: నిందితుల్లో పరివర్తన వచ్చేందుకు జైలుకి పంపిస్తారు. బయట మాదిరిగా జైలు లోపల సకల సౌకర్యాలు లభిస్తే వాళ్లకెందుకు బయటకు వస్తారు. హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ  విడుదలైనా ఏదోఒక కేసులో మళ్లీ జైలుకే వెళ్లడానికి ఇష్టపడతారు. కర్ణాటకలోని ఓ సెంట్రల్ జైలులో అరటి పండ్ల ద్వారా గంజాయి, సిగరెట్లు అక్రమంగా వెళ్లడంపై అధికారులు షాకయ్యారు. ఈ వ్యవహారంపై విచారణ మొదలుపెట్టారు.

జైలుకి వెళ్లే అరటిలో సిగరెట్లు-గంజాయి

Advertisement

ఈ మధ్యకాలంలో కర్ణాటకలోని జైళ్లు వార్తల్లోకి వస్తున్నాయి. అఫ్‌కోర్సు.. అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. కాకపోతే ఖైదీల జల్సాలు, మద్యం, సిగరెట్లు, గంజాయి వంటివి పట్టుబడడంతో దుమారం రేగుతోంది. అసలేం జరుగుతోందంటూ ఇంటా బయటా చర్చ మొదలైంది. తాజాగా కర్ణాటకలో శివమొగ్గ సెంట్రల్ జైలు ఈసారి వార్తల్లోకి వచ్చింది.

నవంబర్ 19న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓ ఆటో జైలు ఆవరణలోకి వచ్చింది. డ్రైవర్ ఎలాంటి వివరణ లేకుండా ఐదు అరటి పండ్ల గెలలను గేటు బయట ఉంచాడు. ఆ తర్వాత అతడు వెళ్లిపోయాడు. జైలు భద్రతా సిబ్బంది సాధారణ తనిఖీల్లో అరటి గెలలను జాగ్రత్తగా పరిశీలించారు. గెలల స్టెమ్ లోపల టేప్‌లో చుట్టిన గంజాయి, సిగరెట్లు కనిపించాయి.

Advertisement

కర్ణాటకలోని మరో జైలులోని బాగోతం

దీనిపై జైలు భద్రతా సిబ్బందిని ప్రశ్నించగా, క్యాంటీన్ సిబ్బంది అరటిపండ్లు ఆర్డర్ చేశారని, అందుకే వాటిని గేటు వద్ద వదిలేశారని అన్నారు. మొత్తం 123 గ్రాముల గంజాయి, 40 సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరొక సంఘటనలో జైలు సిబ్బంది వద్ద గంజాయి దొరికింది. దీనిపై శివమొగ్గ ఎస్పీ మిథున్ కుమార్ మాట్లాడారు.

దీనిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. జైలులోకి గంజాయి అక్రమ రవాణాపై తుంగానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైందని తెలిపారు. గతంలో ఈ జైలులో ఇలాంటి ఘటనలు జరిగాయి. డబ్బులు చెల్లించాలే కానీ ఖైదీలు ఏది కావాలన్నా అది లోపల లభిస్తుండడంపై విమర్శలు తీవ్రమయ్యాయి.

ALSO READ:  బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుఫానుగా మార్చే అవకాశం

ఇటీవల బెంగళూరు సెంట్రల్ జైలులో ఖైదీలు మద్యంతో పార్టీ చేసుకుంటున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు శివమొగ్గ సెంట్రల్ జైలు వంతైంది. ఇలా ఏదో ఒక కారణంతో కర్ణాటలోని జైళ్లు వార్తల్లోకి రావడంపై విపక్ష బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.  ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమని బీజేపీ ఎంపీ బీవై రాఘవేంద్ర అన్నారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×