E-Paper
Advertisement

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
Advertisement

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యల్లాపూర్‌ దగ్గర ఘాట్‌రోడ్‌లో లారీ బోల్తా పడింది. 10 మంది మృతి చెందగా, మరో 15 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో లారీలో 25 మంది ఉన్నారు. కూరగాయలు అమ్మేందుకు వారంతా సవనూర్ నుంచి కుంత మార్కెట్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే లారీ ఘాట్ సెక్షన్‌కు ఎంటరయ్యే సరికి ఒక్కసారిగా బోల్తా పడింది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపూర్ తాలూకాలోని గుల్లాపుర ఘట్ట జాతీయ రహదారిపై కూరగాయల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సావనూర్ నుంచి యల్లాపూర్ వెళుతుండగా ట్రక్కు ప్రమాదావశాత్తు 50 మీటర్ల లోయలో పడింది. ఈ ఘటనలో సుమారు 15 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుబ్బళ్లి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: వీడి క్రూరత్వం ఎవరూ ఊహించలేదు.. కడుపులోని బిడ్డ బయటకి వచ్చేలా హత్య..

ఇదిలా ఉంటే.. కర్నూరు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో విషాదం చోటు చేసుకుంది. వేద పాఠశాల విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్నాటకలోని హంపీలో జరిగే ఆరాధన ఉత్సవాలకు వెళ్లి వస్తున్న విద్యార్థుల తుఫాన్‌ వాహనం టైర్ ఊడిపోవడంతో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హామీ ఇచ్చారు. మృతి చెందిన వారు ఏపీలోని కర్నూలుకు చెందిన వారు.

Advertisement

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×