E-Paper
Advertisement

Dk Shiva kumar: ‘బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే.. మరి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలెందుకు..?’

Dk Shiva kumar: ‘బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే.. మరి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలెందుకు..?’
Advertisement

Dk Shiva kumar: మూడా స్కామ్ కు సంబంధించి కర్ణాటకలో పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధ వాతావరణమే కొనసాగుతున్నది. ఈ కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతిని మంజూరు చేయడంతో అధికార కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి అనుకూలంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. కేంద్రం చెప్పినట్టే గవర్నర్ నడుచుకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియా మాట్లాడారు.

గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు. బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 15 బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారన్నారు. బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే.. అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఉండి ఎందుకు మరి ? అంటూ శివకుమార్ ప్రశ్నించారు. బిల్లులకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే వాటికి ప్రభుత్వం సమాధానిమిస్తుందన్నారు. కానీ, అలా వెనక్కి పంపడం సరికాదన్నారు.

Advertisement

Also Read: బ్రేకింగ్ న్యూస్.. రేపు రాష్ట్ర బంద్.. ఎందుకంటే?

గవర్నర్ కు మంచి ఉద్దేశాన్ని ఇవ్వాలంటూ ఆ దేవుడిని కోరుకుంటున్నానంటూ ఆయన పేర్కొన్నారు. మూడా స్కామ్ లో సీఎం సిద్ధ రామయ్యను విచారించేందుకు అనుమతి ఇవ్వడాన్ని శివకుమార్ తీవ్రంగా ఖండించారు. సిద్ధరామయ్యకు పార్టీ సభ్యులమంతా అండగా ఉంటామన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, జేడీఎస్ లు ప్రయత్నిస్తున్నాయన్నాయంటూ ఆయన విమర్శించారు. కానీ, వారి ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో ఫలించబోవన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×