E-Paper
Advertisement

Kapil Sibal: కేజ్రీవాల్, సిసోడియా, కవిత జైలు జీవితానికి జవాబుదారీ ఎవరు?.. కేంద్ర ప్రభుత్వంపై కపిల్ సిబల్ ఫైర్

Kapil Sibal: కేజ్రీవాల్, సిసోడియా, కవిత జైలు జీవితానికి జవాబుదారీ ఎవరు?.. కేంద్ర ప్రభుత్వంపై కపిల్ సిబల్ ఫైర్
Advertisement

Kapil Sibal: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫిబ్రవరి 27న ప్రత్యేక కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కె. కవిత సహా ఇతర నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పు నేపథ్యంలో కపిల్ సిబల్ స్పందిస్తూ రాజకీయ ప్రతీకారంతోనే ఈ తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా విపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా దర్యాప్తు సంస్థలను వాడుకున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా కపిల్ సిబల్ కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రశ్నలు సంధించారు. కేజ్రీవాల్ సుమారు 126 రోజులు.. మనీష్ సిసోడియా ఏకంగా 503 రోజుల పాటు జైలులో గడిపారని ఆయన గుర్తు చేశారు. ఏ తప్పూ చేయని ఈ నాయకులు జైలులో గడిపిన సుదీర్ఘ కాలానికి ఎవరు పరిహారం చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. వారి వ్యక్తిగత జీవితాలకు.. రాజకీయ ప్రతిష్టకు జరిగిన నష్టానికి ఎవరిని జవాబుదారీగా ఉంచాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమాయకులను ఇన్ని రోజులు కటకటాల వెనుక ఉంచడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆయన అభివర్ణించారు.

Advertisement

ఈ కేసులో ఆర్థిక లావాదేవీలపై వస్తున్న ఆరోపణలను కపిల్ సిబల్ పూర్తిగా కొట్టిపారేశారు. ఇది రూ. 100 కోట్ల కుంభకోణం అని దర్యాప్తు సంస్థలు గొప్పగా పేర్కొన్నాయని.. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయాయని ఎద్దేవా చేశారు. ఈ కేసులో ఎటువంటి అక్రమ ఆర్థిక లావాదేవీలు జరగలేదని కోర్టు తీర్పుతో స్పష్టమైందని పేర్కొన్నారు. సాక్ష్యాలు లేని కేసును ఇన్నేళ్లపాటు సాగదీయడం వెనుక ఉన్న రాజకీయ కుట్రను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరుపై కూడా సిబల్ అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి పనిచేయడం వల్ల అమాయకులు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆరోపణలతోనే నెలల తరబడి జైలులో ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేశారు. ఇప్పుడైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని.. తప్పుడు కేసులతో ప్రతిపక్షాలను అణచివేయాలని చూడటం మానుకోవాలని హితవు పలికారు. న్యాయస్థానం తీర్పుతోనైనా నిజాన్ని అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Read Also: MP Arvind: కవిత పై ఎంపీ అరవింద్ సెటైర్లు.. కవిత లోపలున్నా బయటున్నా ఒరిగేదేం లేదంటూ..?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×