E-Paper
Advertisement

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్
Advertisement

Tirumala Laddu Controversy: కలియుగ దైవం కొలువై ఉన్న తిరుమలలో.. భక్తులు స్వామివారి దర్శనానంతరం అత్యంత పవిత్రంగా భావించి.. ప్రసాదంగా తీసుకునే లడ్డూ తయారీపై రెండ్రోజులుగా విమర్శలొస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో నాణ్యత లేదని, జంతువుల కొవ్వుతో చేసిన నూనె కలిపారని వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా తీవ్రకలకలం రేపాయి. ఈ ఘటనపై ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ చౌహాన్కే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సీజేఐకు ఆయన రాసిన లేఖలో తిరుమల లడ్డూ వివాదంపై ప్రస్తావించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా తిరుమల లడ్డూ తయారు చేశారని ఆయన లేఖలో ప్రస్తావించారు. కొందరు ప్రభుత్వ అధికారుల అవినీతి కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన వాపోయారు. ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సంప్రదాయాలపై అవగాహన ఉన్నవారికే ఆలయ నిర్వహణ ఇవ్వాలని లేఖలో సీజేఐని కోరారు చౌహాన్కే.

Advertisement

Also Read: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

మరోవైపు ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిరోజూ వేలు, లక్షల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునే భక్తులు.. శ్రీవారి లడ్డూని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి లడ్డూ తయారీలో జంతు కొవ్వులు కలిపిన నెయ్యిని వాడారన్న రిపోర్టు బహిర్గతమవ్వడంతో విస్తుపోతున్నారు. కేంద్రమంత్రులు సైతం ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో ఫిష్ ఆయిల్, గొడ్డు, పందికొవ్వు నుంచి తీసిన నూనెలను కలపడం.. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అభిప్రాయపడ్డారు. శ్రీవారితో పెట్టుకున్నవారు సర్వనాశనమైపోతారని దుమ్మెత్తిపోస్తున్నారు.

Advertisement

 

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×