// // JoshiMath sinking | జోషిమఠ్‌లో అంతా మన్నే? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

JoshiMath sinking | జోషిమఠ్‌లో అంతా మన్నే?

JoshiMath sinking | జోషిమఠ్‌లో భూఉపరితలం నుంచి 80 మీటర్ల దిగువన కూడా గట్టి రాయి లేనే లేదు. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని ఈ పట్టణం క్రమేపీ కుంగిపోతున్న సంగతి తెలిసిందే. కుంగుబాటుకు గురవుతున్న జోషిమఠ్‌లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్(PWD) తాజా సర్వే చేపట్టింది. హిమానీ మృత్తిక(moraine)పై పట్టణం నిర్మితం కావడమే కుంగుబాటుకు కారణమన్న గత అంచనాలను సర్వే ప్రాథమిక పరిశీలన ధ్రువీకరిస్తోంది.

వర్టికల్ సింకింగ్‌కు గల అవకాశాలు, అందుకు పరిష్కరాలు ఏమిటన్న అంశాలపై సర్వే ప్రధానంగా దృష్టి సారించింది. అలా నిలువునా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉన్న ఆరు ప్రాంతాలను సర్వే ప్రాథమికంగా గుర్తించింది. ఆ ఆరు ప్రాంతాలు అత్యంత ఎత్తులో ఉన్నాయి.

Advertisement

కొట్టుకువచ్చిన రాళ్లు, మట్టిపైనే జోషిమఠ్ నిర్మాణం జరిగిందని కేంద్ర సాంకేతిక సంస్థలు ఇప్పటికే అప్రమత్తం చేశాయి. ఆయా సంస్థల నివేదికల ఆధారంగా పీడబ్ల్యూడీ జియోటెక్నికల్ సర్వే కుంగుబాటు ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించింది. 80 మీటర్ల దిగువకి కూడా హార్డ్ రాక్ అన్నదే లేదన్న విషయం తొలి ప్రాంతంలోనే తేలిందని పీడబ్ల్యూడీ అధికారులు తెలిపారు.

రెండో ప్రాంతాన్ని సర్వే బృందం పరిశీలించనుంది. అనంతరం మిగిలిన నాలుగు సైట్లలోనూ సర్వే నిర్వహిస్తారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం లేకుండా చూసేందుకు ఈ సర్వే ఉపయోగపడగలదు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×