E-Paper
Advertisement

ISRO PSLV-C54 : మరో పవర్ఫుల్ లాంచింగ్..కౌంట్‌డౌన్ స్టార్ట్..

ISRO PSLV-C54 : మరో పవర్ఫుల్ లాంచింగ్..కౌంట్‌డౌన్ స్టార్ట్..
Advertisement

ISRO PSLV-C54 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ -ISRO మరో శక్తివంతమైన ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీన ఉదయం 11.56 గంటలకు పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే రాకెట్ లింకింగ్ ప్రాసెస్ ను ఇస్రో సైంటిస్టులు పూర్తి చేశారు. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా భారత్కు చెందిన 960కిలోల .. ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ – EOS-06 తో పాటు మరో 8 నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు.

ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-06 ఓషనోశాట్ సిరీస్లోని థర్డ్ జనరేషన్ సాటిలైట్. ఓషనోశాట్-2 స్పేస్క్రాఫ్ట్ కు అప్ డేటెడ్ వర్షన్ గా సేవలను అందించనుంది. ఈ శాటిలైట్ల ద్వారా భారత తీర ప్రాంతాలకు సంబంధించిన రక్షణ వ్యవస్థపై నిఘా విస్తృతం చేయనున్నారు.

Advertisement

ఇక నానో ఉపగ్రహాల జాబితాలో భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన భూటాన్ శాట్, పిక్సెల్ సంస్థ తయారు చేసిన ఆనంద్ శాట్, ధ్రువ స్పేస్ సంస్థ రూపొందించిన రెండు థైబోల్ట్ శాట్లు, అలాగే అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ సంస్థకు చెందిన నాలుగు ఆస్ట్రోకాస్ట్ ఉపగ్రహాలు ఉన్నాయి.

పి.ఎస్.ఎల్.వి-సీ 54 ప్రయోగానికిసర్వం సిద్ధమైంది. వాతావరణం అనుకూలిస్తే శనివారం.. ఉదయం 11.56గంటలకు రాకెట్ నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×