E-Paper
Advertisement

Gun License : తుపాకులకు గిరాకీ

Gun License : తుపాకులకు గిరాకీ
Advertisement

Gun License : హమాస్ దాడుల నేపథ్యంలో ఆయుధాల కోసం ఇజ్రాయెలీలు ఎగబడుతున్నారు. తుపాకీ లైసెన్సుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకొన్న వారి సంఖ్య ఇప్పటికే 7,946కి చేరింది. వ్యక్తిగతంగా హ్యాండ్‌గన్ కోసం 545 మంది దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించింది. 970 కొత్త లైసెన్సులకు ఆమోదముద్ర వేసింది.

లైసెన్స్‌ల కోసం డిమాండ్ విపరీతంగా పెరగడంతో జాతీయ భద్రతా మంత్రిత్వ శాఖ అదనంగా 60 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంది. ఈ ఏడాది ఆరంభం నాటికే మొత్తం మీద 27 వేల తుపాకీ పర్మిట్లను అనుమతించారు. ఇక నేషనల్ సెక్యూరిటీ మినిస్ట్రీ 10వేల ఆయుధాలను కొనుగోలు చేయనుంది. వీటిలో 4 వేల అసాల్ట్ రైఫిల్స్‌ను రూ.191.54 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు కూడా కుదిరాయి.

Advertisement

తాజా పరిణామాల నేపథ్యంలో గన్ పర్మిట్లను సులువుగా పొందలిగేలా నిబంధనలను సడలించారు. తుపాకీ కొనుగోలుపై ఆసక్తి చూపే ఇజ్రాయెల్ పౌరుడెవరైనా సరే.. దరఖాస్తు చేసుకున్న వారం రోజులకే అందించేయాలని ప్రభుత్వం సంకల్పించింది. గాజా ఉద్రిక్తతలు మరి కొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉన్నందున.. పౌరులు గన్ లైసెన్స్ కోసం ముందుకొస్తున్నారు.

ఇక తుపాకీ పేల్చడంలో శిక్షణ కోసం కూడా పలువురు ముందుకొస్తున్నారు. ఈ క్లాస్‌ల కోసం 4.5 గంటల సమయం చాలు. ప్రాక్టికల్ ట్రైనింగ్ లో వంద వరకు తూటాలకు వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తారు. రూ.63 వేలు వెచ్చిస్తే బేసిక్ మోడల్ లభిస్తుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×