E-Paper
Advertisement

కాబోయే భర్త వేధింపులు.. ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ సూసైడ్ అటెంప్ట్.. అసలేం జరిగిందంటే?

కాబోయే భర్త వేధింపులు.. ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ సూసైడ్ అటెంప్ట్.. అసలేం జరిగిందంటే?
Advertisement

Ronisha Satti: జమ్ము కాశ్మీర్ కు చెందిన ప్రముఖ ఇన్ స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రోనిషా సత్తి.. ఆత్మహత్యాయత్నం చేశారు. కాబోయే భర్త ప్రశాంత్ శర్మ తనను, తన కుటుంబాన్ని తప్పుడు ప్రచారాలతో వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో రెండు వీడియోలు పోస్ట్ చేసి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు రోనిషాను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు అత్యవసర సేవలు అందిస్తున్నారు.

రోనిషా తల్లి రీనా సత్తి మాట్లాడుతూ ప్రశాంత్ శర్మపై తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో రోనిషాపై అభ్యంతరక కామెంట్స్ ను ప్రశాంత్ చేశారని పేర్కొన్నారు. తన కూతురి పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించి.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త సాధారణ ఆటో డ్రైవర్ అన్న రీనా.. పిల్లల్ని అప్పు చేసి మరీ చదివించినట్లు తెలిపారు. కుటుంబాన్ని పోషించడానికి తాను బట్టలు సైతం కుట్టానని అన్నారు. తన బిడ్డకు ఇంత అన్యాయం జరిగినా పోలీసుల నుంచి ఎలాంటి సహాయం తమకు లభించలేదని రీనా ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తన కూతురు దగ్గర రూ.10 లక్షల వరకూ డబ్బును ప్రశాంత్ తీసుకున్నారని రీనా ఆరోపించారు.

Advertisement

మరోవైపు ప్రశాంత్ శర్మ తరపు న్యాయవాది ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రశాంత్ శర్మకు 2024 సెప్టెంబర్ లో రోనిషాతో పరిచయం ఏర్పడిందని ఆయన తెలిపారు. ఆమెకు అప్పటికే వివాహం జరిగి విడాకులు అయ్యాయని చెప్పారు. నిశ్చితార్థం చేసుకొని 6 నెలల్లో పెళ్లి కూడా చేసుకోవాలని ప్రశాంత్, రోనిషా భావించారని అన్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో రోనిషాను 3-4 సార్లు దుబాయికి తీసుకెళ్లి బంగారం, భారీ మెుత్తంలో షాపింగ్ ను తన క్లెయింట్ ప్రశాంత్ చేయించారని తెలిపారు. యూపీఐ ద్వారా చేసిన రూ.9.5 లక్షల నగదు లావాదేవీ ఆధారాలు సైతం తన వద్ద ఉన్నాయని ప్రశాంత్ లాయర్ వెల్లడించారు.

Advertisement

Also Read: అమ్మబాబోయ్.. ఎకరం ఏకంగా రూ. 237 కోట్లు.. హైదరాబాద్‌లో ఎక్కడంటే?

పెళ్లి చేసుకోమని ప్రశాంత్ శర్మ ఒత్తిడి తీసుకురావడంతో.. పెళ్లి చేసుకునేది లేదని రోనిషా, ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారని లాయర్ అన్నారు. అంతేకాకుండా రోనిషాకు తన మెుదటి భర్తతో విడాకులు కూడా మంజూరు కాలేదని చెప్పారు. ఈ మేరకు ప్రశాంత్ శర్మ.. రోనిషాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపైనా చీటింగ్ కేసు పెట్టారని తెలియజేశారు. మరోవైపు ప్రశాంత్ పై రోనిషా ఫ్యామిలీ పెట్టిన కేసుపై అప్పుడే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్టే సైతం ఇచ్చిందని న్యాయవాది చెప్పుకొచ్చారు. మెుత్తం మీద రోనిషా ఆత్మహత్య కేసు జమ్ముకాశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా.. ఇందులో ఎవరి వాదనలో నిజం ఉందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనపై జమ్ముకాశ్మీర్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: మొబైల్ బ్యాక్ ప్యానెల్‌ ఇలాగే క్లీన్ చేస్తున్నారా? జాగ్రత్త.. ఫోన్ పూర్తిగా పాడైపోవచ్చు!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×