E-Paper
Advertisement

IndiGo flights: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం.. ఎమ్మెల్యేలు తిప్పలు, రోడ్డు మార్గంలో కొందరు..

IndiGo flights: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం.. ఎమ్మెల్యేలు తిప్పలు, రోడ్డు మార్గంలో కొందరు..
Advertisement

IndiGo flights: ఇండిగో ఎయిర్‌లైన్స్ మొదలైన సంక్షోభం అన్నిరంగాలపై తీవ్రంగా పడుతోంది. కేవలం ట్రావెలర్స్‌పై మాత్రమే కాదు. ఎమ్మెల్యేలు,  మంత్రులు, చివరకు ఎంపీలకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా శీతాకాల పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇబ్బందులకు రెట్టింపు అయ్యాయి. అలాంటి అనుభవం మహారాష్ట్ర ఎమ్మెల్యేలకు ఎదురైంది.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం

Advertisement

మహారాష్ట్రంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నాగపూర్‌లో సోమవారం నుంచి  మొదలుకానున్నాయి. పూణె, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం కాసింత కష్టంగా మారింది. ఒకరోజు ముందుగానే సమావేశాలకు హాజరయ్యేవారు. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో చేసేది లేక చాలా మంది ఎమ్మెల్యేలు ప్రైవేట్ వాహనాలలో నాగ్‌పూర్‌కు బయలుదేరారు.

Advertisement

పూణే-నాగ్‌పూర్ రోడ్డు ప్రయాణం దూరం దాదాపు 700 కిలోమీటర్లు. రోడ్డు దారిలో ప్రయాణించాలంటే దాదాపు 12 గంటలకు పైగా పడుతుంది. ఇబ్బందులు ఎదురైనా కొందరు ఎమ్మెల్యేలు తొలి రోజు సమావేశాల హాజరుకానున్నారు. చాలామంది ఆయా ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు హాజరుకాలేదు.

మహారాష్ట్ర ఎమ్మెల్యేలు తప్పని తిప్పలు 

ఇండిగో విమానాల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది.. కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకప్పుడు నాగ్‌పూర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఎమ్మెల్యేలు విమానాల ద్వారా ట్రావెల్ చేశారు. డజన్ల కొద్దీ విమానాలు రద్దు చేయడంతో ముంబై, పూణె, పశ్చిమ మహారాష్ట్రకు చెందిన అనేకమంది ఎమ్మెల్యేల బుకింగ్‌లను రద్దు అయినట్టు చివరి నిమిషంలో సమాచారం అందింది.

ఇప్పుడు నాగ్‌పూర్‌కు ఎలా చేరుకుంటామో తమకు తెలియదని అంటున్నారు. మళ్లీ బుకింగ్ చేసిన విమానాలు సమస్యలు వస్తే తమ పరిస్థితి ఏంటని కొందరు భయపడుతున్నారు.  కార్లలో దాదాపు 10 నుంచి 12 గంటలు ప్రయాణించాలనే కష్టంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. మధ్య మధ్య ఆగి ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి పరిస్థితి తామొప్పుడు చూడలేదంటున్నారు. 

ALSO READ: ఇండిగో సంక్షోభం.. 1650 విమానాలు నడిపినట్టు ప్రకటన

మహారాష్ట్ర ఉన్నత-సాంకేతిక విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్, ఎమ్మెల్యే సిద్ధార్థ్ షిరోల్‌తో కలిసి చార్టర్డ్ ఫ్లయిట్‌లో ప్రయాణించాలని డిసైడ్ అయ్యారు. నలుగురు లేదా ఐదుగురు ఎమ్మెల్యేలు చార్టర్డ్ ఫ్లయిట్‌లో ట్రావెల్ చేయాలని నిర్ణయించుకున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రానికి ఎమ్మెల్యేలంతా నాగ్ పూర్ చేరుకోవాల్సి ఉంది. ఉదయం 10 గంటలైనా చాలామంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదని తెలుస్తోంది. మరికొందరు చార్టర్డ్ విమానాలను ఆశ్రయిస్తున్నారు. వీలైనంత తొందరగా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని అంటున్నారు సదరు ఎమ్మెల్యేలు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×