E-Paper
Advertisement

Indigo Crisis: ఇండిగో సంక్షోభానికి కారణం వీళ్లే.. ఎంజాయ్ చేస్తున్నారంటూ పేర్లు భయటపెట్టిన ఆ సంస్థ ఉద్యోగి

Indigo Crisis: ఇండిగో సంక్షోభానికి కారణం వీళ్లే.. ఎంజాయ్ చేస్తున్నారంటూ పేర్లు భయటపెట్టిన ఆ సంస్థ ఉద్యోగి
Advertisement

Indigo Crisisఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభానికి కారణమెవరు? దేశవ్యాప్తంగా ఆ సంస్థ విమానాలు ఆగిపోవడం వెనుక కీలక వ్యక్తులున్నారా? ఆ సంస్థ ఉద్యోగుల బహిరంగ లేఖ.. ఎవర్ని టార్గెట్ చేసింది? సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ని లక్ష్యంగా చేసుకుందా? కంపెనీ విషపూరిత సంస్కృత, లోపాలను ఎత్తి చూపిందా? ఈ లేఖ బయటకు రాగానే విమానయాన శాఖ ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో తీగలాడితే దీనిపై డొంక కదలనుంది.

Advertisement

ఇండిగో సంక్షోభం వెనుక వారే కీలకం?

ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థలో ఓ ఉద్యోగి రాసినట్లు చెప్పబడుతున్న ‘బహిరంగ లేఖ’ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది,  దానిపై దుమారం రేగుతోంది. ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ సహా కొందరు అధికారుల వల్ల ఈ పరిస్థితికి కారణమైందని పేర్కొంది. ఏళ్ల తరబడి ఆయా పదవుల్లో వారే ఉండడంతో అహంకారం, అలసత్వం, బెదిరింపులకు దారితీసిందని రాసుంది.

Advertisement

ఇండిగో సంస్థలో పలు లోపాలను ఎత్తి చూపింది. భారత విమానయాన నియంత్రణ సంస్థ- డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. సీఈఓ ఎల్బర్స్‌కు షో కాజ్ నోటీసు జారీ చేసిన సమయంలో ఈ లేఖ వ్యవహారం బయటపడింది. ఈ సంక్షోభం చాలా ఏళ్లుగా కొనసాగుతోందని ఆ లేఖలో సారాంశం. 

టార్గెట్ ఎనిమిది మంది? ఆసక్తికర విషయాలు

ఈ సంక్షోభానికి ప్రణాళికలు, ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగుల రక్షణలో వైఫల్యమని ఆ లేఖలో పేర్కొంది. ఇందులో ఫ్రంట్‌లైన్‌ సిబ్బందిని వినియోగించుకుని, వారి సమస్యలను పరిష్కరించుకున్నట్లుగా కనిపిస్తోందని తెలుస్తోంది. డీజీసీఏ మీద ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే ఇదంతా జరిగినట్టు కనిపిస్తోంది.

అర్హత లేని వారికి కీలకమైన పదవులలోకి కూర్చోబెట్టడం దీనికి కారణంగా తెలుస్తోంది. జవాబుదారీతనం కంటే భయంతో నడిచే పని సంస్కృతి సృష్టించడం అందులో కనిపిస్తోంది. ఆ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని ప్రస్తావించారు.

భద్రతా ప్రమాదాలను గుర్తించిన పైలట్లను ప్రధాన కార్యాలయానికి పిలిపించి బెదిరించారని, చివరకు అవమానించారని ఆ లేఖలో ఆరోపించింది. ఎలాంటి పరిహారం లేకుండా రాత్రి వేళ విధులను రెట్టింపు చేసి సెలవులను తగ్గించారని ప్రస్తావించింది. ఈ సంక్షోభానికి మొత్తం ఎనిమిది మంది ఉన్నతాధికారులు బాధ్యులని స్పష్టంగా ఉంది.

ALSO READ: ఇండిగో సంక్షోభం.. ఎమ్మెల్యేలు తిప్పలు, రోడ్డు మార్గంలో కొందరు

టాప్‌లో CEO పీటర్ ఎల్బర్స్ ఉన్నారట. సంక్షోభం సమయంలో ఆయన నెదర్లాండ్స్‌లో సెలవులో ఉండడం అనేక అనుమానాలు లేకపోలేదు. ఇతర ఎగ్జిక్యూటివ్‌లలో కార్యకలాపాలు, నియంత్రణ విధులకు చెందిన సీనియర్ నాయకులు ఉన్నారు. ఇసిడోర్ పోర్క్వెరాస్ కార్యకలాపాలకు చూస్తున్నారని, ఆషిమ్ మిత్రా విమాన కార్యకలాపాలకు నాయకత్వం వహించినట్టు తెలుస్తోంది.

కార్యకలాపాల నియంత్రణ కేంద్రాన్ని జాసన్ హెర్టర్ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. అయితే లేఖలో పేర్కొన్న వ్యక్తులెవరూ ఇప్పటివరకు స్పందించలేదు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇండిగో బోర్డు, క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూపుని ఏర్పాటు చేసింది. దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×