E-Paper
Advertisement

Indigo Airlines: అయోధ్యకు విమాన సర్వీస్‌లు.. సీతారామలక్ష్మణ వేషధారణలో ఇండిగో సిబ్బంది..

Indigo Airlines : అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడానికి అయోధ్య రామ మందిరం ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు

Indigo Airlines: అయోధ్యకు విమాన సర్వీస్‌లు.. సీతారామలక్ష్మణ వేషధారణలో ఇండిగో సిబ్బంది..
Advertisement

Indigo Airlines : అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి అహ్మదాబాద్‌ నుంచి ఇండిగో సంస్థ తన తొలి విమాన సర్వీస్‌ను గురువారం ప్రారంభించింది. ఇండిగో సిబ్బంది సీతారామ లక్ష్మణ వేషధారణలో ప్రయాణికులకు స్వాగతం పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడానికి అయోధ్య రామ మందిరం ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

అహ్మదాబాద్‌- అయోధ్యల మధ్య వారంలో మూడు రోజుల తమ విమాన సర్వీస్ ను నడపనున్నట్లు ఇండిగో సంస్థ ప్రతినిథులు ప్రకటించారు.యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ లక్నో నుంచి ఈ విమాన సర్వీసులను గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వర్చువల్‌గా పాల్గొన్నారు.

అయోధ్యకు విమాన సర్వీసుల ప్రారంభం వేళ ఇండిగో సిబ్బంది శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి వేషధారణ ధరించారు. బోర్డింగ్‌ అనౌన్స్‌మెంట్‌ చేయడంతోపాటు విమానం ఎక్కేందుకు వచ్చిన ప్రయాణికులను శ్రీరాముడు , సీతాదేవి, లక్ష్మణుడి అవతారంలో ఆహ్వానించారు. హనుమంతుడి వేషధారణలో మరో ఉద్యోగి మోకాలిపై ఉండి ప్రయాణికులకు స్వాగతం పలికారు. ఇండిగో సిబ్బంది వేషధారణను చూసి ప్రయాణికులు ముగ్ధులయ్యారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×