E-Paper
Advertisement

India’s GDP: ఇండియా జీడీపీ గణాంకాలు విడుదల

India’s GDP: ఇండియా జీడీపీ గణాంకాలు విడుదల
Advertisement

The Economy grew 78 % in the March: దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకమైన జీడీపీ గణాంకాలు విడుదలయ్యాయి. 2023-24 మార్చితో ముగిసిన మూడో త్రైమాసికంలో అంచనాలు మించి 7.8 శాతంగా జీడీపీ వృద్ధి నమోదు అయ్యింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 8.2 శాతంగా నమోదు అయ్యింది. ఇందుకు సంబంధించి కేంద్ర గణాంక కార్యాలయం వివరాలను వెల్లడించింది.

డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికం 8.6 శాతంతో పోలిస్తే ఇది కాస్త తక్కువే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 6.02 శాతంగా నమోదు అయ్యింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 7 శాతం వృద్ధి చెందింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెండోసారి ఎన్ఎస్ఓ వెలువరించిన అంచనాల్లో 7.7 శాతం వృద్ధి నమోదు కావచ్చని కేంద్ర గణాంక కార్యాలయం పేర్కొంది.

Advertisement

అయితే, అంతకుమించి జీడీపీ వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఈ సంవత్సరం తొలి మూడు నెలల్లో పొరుగు దేశమైన చైనా 5.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసిన విషయం తెలిసిందే. దేశానికి సంబంధించిన సంవత్సర ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని ద్రవ్యలోటు అంటారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.63గా నమోదు అయ్యింది. అయితే, వాస్తవానికి బడ్జెట్ లో 5.8 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేశారు.

Also Read: సాఫ్టుగా ఉంటే అంతే! ఐటీ ఉద్యోగ కష్టాలు

Advertisement

వాస్తవ రూపంలో చూసినప్పుడు మాత్రం ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసం రూ. 16.53 లక్షల కోట్లు అని అధికార గణాంకాలు చెబుతున్నాయి. కాగా, స్థూలంగా పన్నుల రూపంలో రూ. 23.26 లక్షల కోట్లు ప్రభుత్వానికి రాగా, వ్యయం రూ. 44.42 లక్షల కోట్లుగా ఉంది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×