E-Paper
Advertisement

Indian Student: యూకేలో దారుణం: భారత విద్యార్థిపై కత్తులతో దాడి.. చికిత్స పొందుతూ మృతి!

Indian Student: యూకేలో దారుణం: భారత విద్యార్థిపై కత్తులతో దాడి.. చికిత్స పొందుతూ మృతి!
Advertisement

Indian Student: విదేశాల్లో భారత్‌‌కు చెంది మరో తెలుగు విద్యార్థి మృతి.. యూకేలోని వోర్‌స్టర్ లో నవంబర్ 25న ఉదయం 4:15 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్యానా రాష్ట్రం చర్ఖీ దాద్రి జిల్లా జాగ్రాంబాస్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ షియోరాన్ (30) అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దారుణంగా కత్తిరాళ్లతో దాడి చేశారు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ రోజు మధ్యాహ్నం మృతి చెందాడు.

విజయ్ ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఉన్నత చుదువుల కోసం యూకే వెళ్లాడు. బ్రిస్టాల్‌లోని UWEలో చదువుతున్నాడు. భారతదేశంలో ఉన్న ఉద్యోగంను వదులుకుని విదేశాల్లో భవిష్యత్తును రూపొందించుకోవాలనే ఆశతో యూకే చేరాడు. కానీ, గుర్తు తెలియని వ్యక్తుల చేతులో మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా పోలీసులు CCTV ఫుటేజ్‌లు, సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు.

Advertisement

అయితే, విజయ్ సోదరుడు రవి కుమార్, హర్యానా-పంజాబ్‌కు చెందిన కొంతమంది ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నాడు. “విజయ్‌పై హర్యానా, పంజాబ్ నుంచి వచ్చిన వ్యక్తులు దాడి చేశారు” అని రవి తన లేఖలో పేర్కొన్నాడు. పోలీసులు ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసి, విచారిస్తున్నారు.

Also Read: హిడ్మా ఎన్‌కౌంటర్‌ తర్వాత..పువర్తిలో ప్రస్తుత పరిస్థితి ఇదే!

Advertisement

అలాగే విజయ్ కుమార్ మృతదేహాన్ని వెంటనే భారత్‌కు తీసుకురావడానికి సహాయం చేయాలని కోరుతూ మృతుడి కుటుంబసభ్యులు విదేశాంగ మంత్రిత్వ శాఖ, హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీలను సహాయం కోరారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×