E-Paper
Advertisement

జర్నలిజం నోబెల్ పులిట్జర్.. భారతీయులను వరించిన‌ ప్రతిష్ఠాత్మక పురస్కారం

జర్నలిజం నోబెల్ పులిట్జర్.. భారతీయులను వరించిన‌ ప్రతిష్ఠాత్మక పురస్కారం
Advertisement

Pulitzer Prize: పాత్రికేయ రంగానికి నోబెల్ గా భావించే ప్రపంచ ప్రఖ్యాత పులిట్జర్‌ పురస్కారం ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్ యుగంలో పెరుగుతున్న నిఘా, సైబర్ మోసాలపై వారు చేసిన అద్భుతమైన పరిశోధనాత్మక కథనాలకు ఈ గుర్తింపు లభించింది. భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్కే సుపర్ణాశర్మ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బ్లూమ్‌బెర్గ్’కు చెందిన నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి వీరు ఈ అవార్డును పంచుకోనున్నారు.

జర్నలిజం రంగంలో అత్యున్నత పురస్కారమైన పులిట్జర్‌ను వీరు ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్, కామెంటరీ’ విభాగంలో గెలుచుకున్నారు. డిజిటల్ నిఘా (Digital Surveillance)చ‌ అంతర్జాతీయ సైబర్ మోసాలకు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలను సామాన్యులకు అర్థమయ్యేలా చిత్రాలతో వివరించినందుకు ఈ గౌరవం దక్కింది. ఈ అవార్డులను అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పులిట్జర్ బోర్డు ప్రకటించింది. వీరు చేసిన పరిశోధన అంతర్జాతీయ స్థాయి సైబర్ నేరాల నెట్‌వర్క్‌ను వెలుగులోకి తెచ్చింది.

Advertisement

నేటి సమాజంలో ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్న డిజిటల్ నిఘా పద్ధతులు.. అమాయకులను ముంచేస్తున్న సైబర్ మోసాల వెనుక ఉన్న వాస్తవాలను వీరు విస్తృతంగా వెలుగులోకి తెచ్చారు. బ్లూమ్‌బెర్గ్ బృందంతో కలిసి వీరు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి.. సాంకేతిక ఆధారాలను సేకరించారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన రిపోర్టింగ్.. గ్రాఫికల్ ఇలస్ట్రేషన్ల ద్వారా ఆ నివేదికలను రూపొందించి పబ్లిష్ చేశారు. వీరి కృషి పాత్రికేయ ప్రపంచంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది.

Read Also: కడపలో కిరాతకం.. భార్య లావుగా ఉందని పాలకోవాలో విషం కలిపి చంపిన భర్త

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×