E-Paper
Advertisement

Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో వాయుసేన అదిరిపోయే వీడియో.. మన జవాన్ల పరాక్రమాన్ని చూసి తీరాల్సిందే! 

Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో వాయుసేన అదిరిపోయే వీడియో.. మన జవాన్ల పరాక్రమాన్ని చూసి తీరాల్సిందే! 
Advertisement

Operation Sindoor: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత వాయుసేన (IAF) తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ‘ఆపరేషన్ సిందూర్’ కి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను పోస్ట్ చేసింది. దేశ రక్షణలో వాయుసేన ప్రదర్శిస్తున్న సాహస పౌరుషాలను, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో శత్రువుల ఆటకట్టించే వ్యూహాలను ఈ వీడియోలో అద్భుతంగా ఆవిష్కరించారు.

 ఆకాశంలో యుద్ధ విమానాల గర్జన, అత్యంత ఎత్తులో పైలట్లు ప్రదర్శించే నైపుణ్యం, కచ్చితత్వంతో కూడిన దాడుల  దృశ్యాలను ఈ వీడియోలో చూపించారు. సుఖోయ్-30 MKI, రఫేల్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాల శక్తి సామర్థ్యాలను, అవి ఆపరేషన్లలో పాల్గొనే తీరును ఈ వీడియో ప్రతిబింబిస్తుంది. ఆపరేషన్ సిందూర్ ద్వారా మాతృభూమి రక్షణే పరమావధిగా ప్రాణాలకు తెగించి పోరాడే వాయుసేన యోధుల అంకితభావానికి ఈ వీడియో ఒక నివాళిగా నిలిచింది గణతంత్ర దినోత్సవ వేళ ఈ వీడియో విడుదల కావడం నెటిజన్లలో దేశభక్తిని నింపడమే కాకుండా, వాయుసేన పట్ల గౌరవాన్ని మరింత పెంచుతోంది.

Advertisement

2025 ఏప్రిల్‌లో పహల్గామ్ లోని పర్యాటక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇది కేవలం భద్రతా దళాలపైనే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థ మరియు పర్యాటక రంగంపై జరిగిన దాడిగ ప్రభుత్వం పరిగణించింది.

ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద మూలాలను వేటాడేందుకు ఈ దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని నామకరణం చేసిన భార‌త ఆర్మీ, సరిహద్దుల ఆవల ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఉగ్రదాడికి ప్రతీకారంగా, మే 7, 2025న భార‌త ఆర్మీ ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ మెరుపు దాడిలో రఫేల్, సుఖోయ్-30 MKI, మిగ్-29 యుద్ధ విమానాలు శత్రు స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్‌లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు, శత్రు బలగాలను భారత సైన్యం మట్టుబెట్టింది.

Advertisement

Read Also: Chandrababu Naidu: ఏఐ ద్వారా ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కారం.. ఏపీలో టెక్నాలజీ పాలనపై సీఎం చంద్రబాబు సమీక్ష! 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×