E-Paper
Advertisement

India – Germany: భారత్-జర్మనీ మధ్య రిలేషన్స్.. డిఫెన్స్ సెక్టార్‌కి బూస్ట్, రష్యాపై ఎఫెక్ట్ ఎంత?

India – Germany: భారత్-జర్మనీ మధ్య రిలేషన్స్.. డిఫెన్స్ సెక్టార్‌కి బూస్ట్, రష్యాపై ఎఫెక్ట్ ఎంత?
Advertisement

India – Germany: భారత్-జర్మనీ మధ్య సంబంధాలు తారాస్థాయికి చేరాయా? ఆరు సబ్‌మెరైన్లు ఇండియాలో నిర్మించేందుకు రెడీ అయ్యిందా?  రెండు దేశాల మధ్య సంబంధాలు రష్యాపై ఏ మాత్రం ప్రభావం చూపునుంది? భారత విదేశాంగ శాఖ అధికారులు ఏమన్నారు? ఇదే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది.

భారత్-జర్మనీ మధ్య సంబంధాలు

Advertisement

అమెరికా సుంకాలు పెంచిన నేపథ్యంలో ఐరోపాతో ఆర్థిక సంబంధాలు పెంచుకుంటోంది భారత్. ఈ క్రమంలో యూరప్‌లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీతో ఆర్థిక, భద్రత సంబంధాల బలోపేతం కోసం పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో రక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, విద్యారంగాలకు సంబంధించినవి ఉన్నాయి.

నౌకాదళం సామర్థ్యం పెంచుకునే క్రమంలో జర్మనీకి చెందిన ఓ కంపెనీ.. భారతీయ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులోభాగంగా ఆరు అత్యాధునిక జలాంతర్గాములను భారత్‌లో నిర్మించనుంది. గతేడాది మే నెలలో జర్మనీ ఛాన్స్‌లర్‌‌గా భాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫ్రెడ్రిక్మెర్జ్ తొలిసారి ఆసియా పర్యటకు వచ్చారు.

Advertisement

డిఫెన్స్ సెక్టార్‌కి బూస్ట్, రష్యాపై ఎఫెక్ట్ ఎంత?

అందులోనూ భారత్‌ని ఆయన ఎంచుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మెర్జ్, సోమవారం అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఇరుదేశాలు ప్రతిపాదించాయి. రెండు దేశాలు 50 బిలియన్ల డాలర్ల వాణిజ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో ఒప్పందాలు చేసుకున్నాయి. 

 ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. మొత్తం 19 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రక్షణ, భద్రత, వాణిజ్యం, ఖనిజాలు, సెమీ కండక్టర్లు, శాస్త్ర-సాంకేతిక రంగాలు, విద్య, నైపుణ్యం, పరిశోధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి.  ముఖ్యంగా రక్షణ, ఉన్నత విద్యారంగాల్లో సహకారానికి మార్గ సూచీ రూపొందించుకోనున్నాయి.

సంయుక్త ప్రకటన నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడారు. రక్షణ, భద్రత రంగాల్లో ప్రతీ ఏటా పెరుగుతున్న సహకారం ఇరుదేశాల మధ్య ఐక్యతకు నిదర్శనమన్నారు. చాన్స్‌లర్మెర్జ్‌ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు బలపడుతున్నాయి. భారత్‌ నుంచి ఏటా నైపుణ్య కార్మికుల డిమాండ్‌ పెరుగుతోందన్నారు. భారత్‌ వైద్య నిపుణులకు జర్మనీలో గిరాకీ ఉందన్నారు.

ALSO READ:  మంటల్లో లగ్జరీ బస్సు..  ఆటోడ్రైవర్ హెచ్చరిక

ప్రపంచంలో రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు చైనా- అమెరికా నుండి ఆర్థిక, భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్-జర్మన్ అధినేతలు సమావేశం కావాడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ రక్షణ రంగానికి  రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, యూకెలను ప్రధాన సరఫరాదారులుగా ఉన్నాయి. డిఫెన్సు విభాగంలో దశాబ్దాలుగా మాస్కోపై ఆధారపడింది న్యూఢిల్లీ.

ఇటీవలకాలంలో దేశీయంగా రక్షణ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తోంది. రష్యాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్-జర్మనీల సంబంధాల ప్రభావం రష్యాపై ఎంత ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. రక్షణ ఒప్పందాలపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడారు.

రక్షణ వనరులను సిద్ధాంతం పరంగా నిర్ణయించలేమన్నారు. గతంలో చాలా సమయం తీసుకునేందని, ఇప్పుడు చాలా వేగంగా ఆమోదించబడుతున్నాయని అన్నారు. జాతీయ ప్రయోజనాల ఆధారంగా రక్షణ ఉత్పత్తులను ఎక్కడి నుండి పొందాలో అనేది భారత్ ఎంచుకుంటుందని అన్నారు. ఇది అస్సలు సైద్ధాంతికమైనది కాదన్నారు.

మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్‌తో నౌకాదళం కోసం ఆరు జలాంతర్గాములను నిర్మించడానికి జర్మనీకి చెందిన థైసెన్‌క్రాప్ మెరైన్ సిస్టమ్స్తో కుదిరిన డీల్‌పై బెర్లిన్-న్యూఢిల్లీ చర్చలు జరిగినట్టు చెప్పారు. భారత్ ఎప్పటికీ రష్యాతో కలిసి పని చేస్తోందన్నారు. ఎందుకంటే సైనిక పరికరాలు ఎక్కువగా అక్కడి నుంచే వస్తాయన్నారు. భారత దేశం పట్ల జర్మనీ రక్షణ విధానం మారిందన్నారు మిస్రీ. 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×