E-Paper
Advertisement

Bio Bitumen: రైతులకు గడ్కరీ గుడ్ న్యూస్: పొలంలోని చెత్తతో వేల కోట్లు.. ఇక తగలబెట్టాల్సిన పనిలేదు!

Bio Bitumen: రైతులకు గడ్కరీ గుడ్ న్యూస్: పొలంలోని చెత్తతో వేల కోట్లు.. ఇక తగలబెట్టాల్సిన పనిలేదు!
Advertisement

Bio Bitumen: రైతులు పంట కోశాక మిగిలిన గడ్డిని, చెత్తను ఏం చేయాలో తెలియక తగలబెడుతుంటారు. కానీ ఇకపై అదే చెత్త రైతులకు కాసుల వర్షం కురిపించబోతోంది. గడ్కరీ చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటంటే.. వాణిజ్య అవసరాల కోసం ‘బయో-బిటుమెన్’ (Bio-Bitumen)ను ఉత్పత్తి చేయడంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. భారత రోడ్డు మౌలిక సదుపాయాల రంగంలో ఈరోజు ఒక చారిత్రాత్మక మైలురాయి న‌మోదైంద‌న్నారు.

ఈ అద్భుతమైన ఆవిష్కరణ వెనుక ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) శాస్త్రవేత్తలకు గడ్కరీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. “వ్యవసాయ వ్యర్థాల నుండి రోడ్డు వరకు: పైరోలిసిస్ ద్వారా బయో-బిటుమెన్” అనే వారి పరిశోధన.. రైతుల పొలాల్లో మిగిలిపోయే వ్యర్థాలను ఎలా జాతీయ వనరుగా మార్చవచ్చో నిరూపించిందన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు.

ఆదా కానున్న‌ రూ. 4,500 కోట్లు

Advertisement

సాధారణ బిటుమెన్ (తారు)లో 15 శాతం మేర ఈ బయో-బిటుమెన్‌ను కలపడం (Blending) ద్వారా భారతదేశానికి ఏటా సుమారు రూ. 4,500 కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని గడ్కరీ వెల్లడించారు. దీనివల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందన్నారు.

వ్యవసాయ వ్యర్థాలను ఇలా రోడ్ల నిర్మాణానికి వాడటం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, రైతులకు కొత్త ఆదాయ మార్గాలు (జీవనోపాధి) లభిస్తాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం కలలుగంటున్న ‘వికసిత్ భారత్-2047’ సాధనలో, వృత్తాకార ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇదొక విప్లవాత్మక ముందడుగు అని ఆయన అభివర్ణించారు.

బిటుమెన్ అంటే ఏమిటి?

Advertisement

బిటుమెన్ అంటే మనం రోడ్లు వేయడానికి వాడే నల్లటి ‘తారు’. సాధారణంగా దీనిని ముడి చమురు (Crude Oil) శుద్ధి చేసేటప్పుడు తీస్తారు. కానీ, ఇప్పుడు సరికొత్తగా వ్యవసాయ వ్యర్థాలు, గడ్డి నుంచి ఈ బయో-బిటుమెన్ ను తయారు చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, రోడ్ల నాణ్యత, మన్నిక కూడా పెరుగుతుంది. విదేశాల నుంచి చమురు దిగుమతులు తగ్గి, మన రైతులకు ఆదాయం లభిస్తుంది.

Read Also: మీ కుటుంబం మొత్తం వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్లు మొక్కలేదా?.. కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత‌ల‌ తీవ్ర ఆగ్రహం!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×