E-Paper
Advertisement

India Bangladesh Test : క్లీన్‌స్వీప్ చేసిన భారత్..

India Bangladesh Test : క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
Advertisement

India Bangladesh Test : బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. రసవత్తరంగా జరిగిన రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి.. టీమ్‌ ఇండియా ఆదిలో తడబడింది. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతూ.. కష్టాల్లో పడింది.

45 పరుగులు… 4 వికెట్ల ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌… మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో ఓ దశలో గెలుపు వారివైపే ఉన్నట్టు కనిపించింది. ఆ సమయంలో అయ్యర్‌ 29 పరుగులు, అశ్విన్‌ 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. మరో వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడుతూ 8వ వికెట్‌కు 71 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేసి, జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు భారత బ్యాటర్లలో అక్షర్‌పటేల్‌ ఒక్కడే 34 పరుగులతో రాణించాడు. ఇక బంగ్లా బౌలర్లలో మిరాజ్‌ 5 వికెట్లు తీయగా.. షకీబ్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

టెస్టు సిరీస్‌ను గెలిచిన తర్వాత ట్రోఫీని కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ అందుకున్నాడు. అనంతరం యువ ఆటగాడు సౌరభ్‌ కుమార్‌కు అందజేసి.. గతంలో ఎంఎస్ ధోనీ పాటించిన సంప్రదాయాన్ని ఇప్పుడు రాహుల్‌ కొనసాగించాడు. రెండో టెస్టులో జట్టుకు విజయాన్ని అందించిన అశ్విన్‌ మ్యాన్‌… ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను పుజారా గెలుచుకున్నాడు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×