E-Paper
Advertisement

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Bilaspur:  బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!
Advertisement

Bilaspur: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ఒకే రైల్వే ట్రాక్‌పై ఏకంగా మూడు రైళ్లు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించి భయంతో కేకలు వేశారు. అయితే, పెను ప్రమాదాన్ని పసిగట్టిన మూడు రైళ్ల లోకోపైలట్‌లు తక్షణమే అప్రమత్తమయ్యారు. వారు అత్యంత చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి, సరైన సమయంలో రైళ్లను నిలిపివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లోకోపైలట్ల అప్రమత్తత వల్లే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నిలిచిపోయింది.

Read Also: Express Train Incident: ట్రైన్ చక్రాలకు నిప్పు.. ఒక్కసారిగా అందరూ పొలాల్లోకి దూకి..

Advertisement

ఈ తాజా ఘటన రైల్వే భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఇదే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనలో, ఒక గూడ్సు రైలును ప్రయాణికుల రైలు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకోపైలట్‌తో సహా మొత్తం 11 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఆ విషాద ఘటన మరువకముందే, ఇప్పుడు బిలాస్‌పుర్‌లో మళ్లీ అదే తరహాలో ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు రావడం గమనార్హం. ఇది సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమా లేక మానవ తప్పిదమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×