E-Paper
Advertisement

Asaram Bapu : రేప్ కేసులో ఆశారాంకు మరోసారి జీవితఖైదు..

Asaram Bapu : రేప్ కేసులో ఆశారాంకు మరోసారి జీవితఖైదు..
Advertisement

Asaram Bapu : ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూ మరో అత్యాచార కేసులో దోషిగా తేలారు. ఈ కేసులో ఆయనకు జీవితఖైదు విధిస్తూ గుజరాత్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే ఆశారాం బాపూ మరో రేప్‌ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.

10 ఏళ్ల క్రితం నాటి అత్యాచారం కేసులో గాంధీనగర్‌ కోర్టు ఆశారాంను దోషిగా తేల్చింది. ఈ కేసులో సుదీర్ఘ విచారణ విచారణ చేపట్టిన గాంధీనగర్‌ సెషన్స్‌ కోర్టు.. ఆశారాంను దోషిగా తేల్చుతూ సోమవారం తీర్పు వెలువరించింది. మంగళవారం ఆశారాంకు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆశారాం బాపూ భార్య సహా మిగిలిన ఆరుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

Advertisement

ఏం జరిగిందంటే..?
2013లో గుజరాత్‌ మోతేరాలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు సూరత్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2001 నుంచి 2006 మధ్య ఆశారాం తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ఒక్కడికే శిక్ష పడింది.

గతంలో జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఓ 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలారు ఆశారాంబాపూ.
ఈ కేసులోనూ జీవితఖైదు పడింది. 2018 నుంచి జోధ్‌పూర్‌ జైలులో ఆశారాం బాపూ శిక్ష అనుభవిస్తున్నారు.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×