E-Paper
Advertisement

Rain Alert: అలర్ట్.. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Rain Alert: అలర్ట్..  పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Advertisement

Rain Alert: దేశ వ్యాప్తంగా అల్పపీడనం కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ముంబై సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో జులై 15 నుంచి 22 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర,గుజరాత్, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఉత్తరాఖాండ్, అస్సాంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల రోడ్లు, ఇండ్లు నీటమునిగాయి. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఇదిలా ఉంటే.. మరో వైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య అస్సాం నుంచి వాయివ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి సగటున 5.8 కి. మీ ఎత్తులో గాలి బలహీనపడింది. దీంతో శుక్రవారం నుంచి కొన్ని ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కోస్తా సముద్ర తీరం వెంబడి వర్షాలు కురుస్తున్నాయి. అంతే కాకుండా కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరులో వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారం ఉదయం నుంచి జులై 18 వరకు భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.

Also Read:  చెన్నైలో సీజ్.. చైనా నుంచి పాక్‌‌కి డేంజర్ కెమికల్స్..

Advertisement

శుక్రవారం సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. రానున్న రెండు వారాలు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శుక్రవారం ఖమ్మం జిల్లాలోని వైరా, తల్లాడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు, జనగామ జిల్లాలోని దేవరుప్పులలో భారీ వర్షం నమోదైంది. గురువారం రాత్రి తూర్పు, మధ్య తెలంగాణలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×