E-Paper
Advertisement

Heavy Rainfall India: సమ్మర్ లో భారీ వర్షసూచన.. అలర్ట్ చేసిన ఐఎండీ.. ఇదేమి చిత్రమో కదా..

Heavy Rainfall India: సమ్మర్ లో భారీ వర్షసూచన.. అలర్ట్ చేసిన ఐఎండీ.. ఇదేమి చిత్రమో కదా..
Advertisement

Heavy Rainfall India: అసలే సమ్మర్ సీజన్.. ఎండలు భగభగమంటున్నాయి. ఈ తరుణంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించడం విశేషం. ఓవైపు ఎండల ధాటికి వేడిగాలులు వీస్తున్న తరుణంలో, భారత వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.

దేశ వ్యాప్తంగా మండే ఎండలతో ప్రజలు బేజారవుతున్న పరిస్థితి. ఉదయం 9 గంటలకే భానుడి భగభగలు అధికం కావడంతో సామాన్య ప్రజానీకం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో సమ్మర్ సీజన్ ముందుగానే వచ్చిందని చెప్పవచ్చు. శివరాత్రికి ముందుగానే ఎండలు విపరీతం కావడంతో, ఉదయం 10 తర్వాత వృద్ధులు, చిన్నారులు బయటకు రాలేని పరిస్థితి. ఇటీవల తెలంగాణలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇలాంటి సమయంలో భారత వాతావరణ శాఖ నుండి మరో కీలక ప్రకటన రావడం విశేషం.

Advertisement

పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అలాగే వాతావరణంలో కూడా మార్పు వస్తుందని, పలుచోట్ల చల్లని గాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా వారు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలలో భారీ వర్షాలు ఆదివారం, సోమవారం కురుస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. సోమవారం జమ్ము కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలలో వాతావరణంలో తేమ కనిపిస్తుందన్నారు. అంతే కాకుండా కోస్తా కర్ణాటకలో వాతావరణ పరిస్థితులు ఇదే రీతిలో ఉంటాయని ప్రకటించారు. రానున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురిసిన సమయంలో గృహాలకు పరిమితం కావడం మంచిదంటూ సూచించారు.

సమ్మర్ సీజన్ లో వర్షాలు కురుస్తాయని ప్రకటన రావడంపై, వేడిగాలుల నుండి కాస్తైనా ఉపశమనం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పాత భవనాలలో నివసించే ప్రజలు తప్పనిసరిగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే పలు రాష్ట్రాల పరిస్థితి ఇలా ఉంటే, ఏపీలో కూడా పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వేడి గాలులు అధికం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

Advertisement

Also Read: AP Govt: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు పండగే..

ఇప్పటికే మార్చి 2 వ తేదీ వరకు భానుడి భగభగలు అధికంగా ఉంటాయని తెలంగాణ వాతావరణ అధికారులు ప్రకటించారు. తెలంగాణలోని పలు జిల్లాలలో సుమారు 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. ఏపీ, తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిస్తే వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావిస్తున్నారు, కానీ భారీ వర్షాల హెచ్చరిక జాబితాలో ఏపీ, తెలంగాణ లేదు. వాతావరణ శాఖ విడుదల చేసిన రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఎండలు అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏదిఏమైనా వర్షాలు కురిసే రాష్ట్రాలలోని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, అలాగే ఎండలు అధికంగా ఉన్న రాష్ట్రాలలో వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు అధికారులు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×