E-Paper
Advertisement

ఐఐటీలను అధిగమించేలా.. బెంగళూరు ఐఐఐటీ విద్యార్థి‌కి బంపరాఫర్, ఏకంగా రూ.1.5 కోట్ల ప్యాకేజ్

ఐఐటీలను అధిగమించేలా.. బెంగళూరు ఐఐఐటీ విద్యార్థి‌కి బంపరాఫర్, ఏకంగా రూ.1.5 కోట్ల ప్యాకేజ్
Advertisement

IIIT Placement: చాలామంది విద్యార్థులు ఐఐటీల్లో సీటు సాధించాలని కోరుకుంటారు. ఎందుకంటే అందులో చదివితే తమ జీవితం సెటిలైపోయిందని భావిస్తుంటారు. అందుకే ఐఐటీల్లో ప్రవేశానికి అంత డిమాండ్ ఉంటుంది. తాజాగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఐఐటీలను అధిగమిస్తున్నాయి కొన్ని ఐఐఐటీలు, ఎన్ఐటీలు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం.

ఐఐటీలను అధిగమించేలా ఐఐఐటీలు:  బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-IIIT కి చెందిన ఓ విద్యార్థి క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఏకంగా రూ. 1.5 కోట్ల ప్యాకేజీని దక్కించుకున్నాడు. క్యాంపస్‌లో వచ్చిన అత్యధిక ఆఫర్లలో ఇది ఒకటి. ఈ సీజన్‌లో పలు ఐఐటీలు ప్రకటించిన అత్యధిక ప్యాకేజీల కంటే ఇది ఎక్కువ.

Advertisement

బెంగళూరు ఐఐఐటీ విద్యార్థి‌కి బంపరాఫర్:  ఐఐఐటీ బెంగళూరులో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చదివిన ఆ విద్యార్థి భారీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ విద్యార్థితోపాటు మరో ఇద్దరికి రూ.1.3 కోట్ల వేతనంతో ఉద్యోగాలు దక్కించుకున్నారు. ప్లేస్‌మెంట్లలో మరో 22 మందికి రూ.60 లక్షలకు పైగా జీతం లభించింది. 27 మంది రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య ప్యాకేజీలు దక్కించుకున్నారు.

క్యాంపస్ ప్లేస్ మెంట్లలో ఏకంగా కోటిన్నర ప్యాకేజ్: 110 మందికిపైగా విద్యార్థులు రూ.20 లక్షలకు మించిన వార్షిక వేతనంతో ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. బెంగళూరు ఐఐఐటీ 26వ స్నాతకోత్సవంలో ప్లేస్‌మెంట్ గణాంకాలను ప్రకటించింది ఆ సంస్థ. ఈ ఏడాది 316 మంది పట్టాలు పుచ్చుకున్నారు. అందులో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌-95 మంది, ఎంటెక్‌-175 మంది, ఎంఎస్‌-రిసెర్చ్‌ -32 మంది పూర్తి చేశారు.

Advertisement

ALSO READ: నగరమంతా జలమయం.. అకస్మాత్తుగా ప్రత్యక్షమైన స్పైడర్ మ్యాన్.. నెట్టింట హల్ చల్!

ఇదికాకుండా మరో 14 మందికి పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. స్నాతకోత్సవంలో పలువురు విద్యార్థులకు బంగారు పతకాలు అందుకున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేసిన ట్విన్స్ సిద్ధార్థ్‌ కొఠారి-సంకల్ప్‌ కొఠారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిమ్‌హాన్స్‌కు చెందిన న్యూరో సర్జన్‌ వికాస్‌ వజాయిల్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో 100వ పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×