E-Paper
Advertisement

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ
Advertisement

IAS Officer: నేటి పాలనా వ్యవస్థలో లంచగొండితనం, బాధ్యతారాహిత్యం వంటి వార్తలే తరచూ వినిపిస్తున్న తరుణంలో, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. “నాకు రోజుకు కేవలం నాలుగు గంటల పనే ఉంటోంది.. అందుకే నా జీతంలో సగం కోత విధించండి” అని కోరుతూ ఆయన రాసిన లేఖ ఇప్పుడు పరిపాలనా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఒక ఉన్నతాధికారి హోదాలో ఉండి కూడా, సరైన పనిలేకుండా పూర్తి జీతం తీసుకోవడం తన మనస్సాక్షికి విరుద్ధమని ఆయన స్పష్టం చేయడం విశేషం.

ఎవరీ రింకూ సింగ్ రాహీ? ఏంటా లేఖ కథ?
యూపీకి చెందిన ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ రాహీ విచారణాధికారులు, సిబ్బంది శాఖ ముఖ్య కార్యదర్శికి ఒక వినూత్న విజ్ఞప్తితో లేఖ రాశారు. తనకు ఇతర అధికారులతో సమానంగా తగిన బాధ్యతలు అప్పగించాలని, ఒకవేళ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు తాను తగినవాడిని కానని భావిస్తే నిబంధనల ప్రకారం వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ప్రజాధనాన్ని ఊరకే జీతంగా తీసుకోవడానికి ఇష్టపడని ఆయన, తనకు అప్పగించిన పనులకు తగ్గట్టుగా సగం జీతం మాత్రమే చెల్లించాలని లేఖలో పేర్కోవడం ఆయన నిజాయితీకి అద్దం పడుతోంది.

Advertisement

అక్రమాలపై తిరుగుబాటే అసలు కారణమా?
అయితే ఈ లేఖ వెనుక కేవలం పని ఒత్తిడి లేకపోవడమే కాదు, పరిపాలనలో జరుగుతున్న తీవ్ర లోపాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. పాలనలో పారదర్శకత కోసం క్షేత్రస్థాయి సిబ్బంది హాజరు, ఉపాధి హామీ పనుల వివరాలు, ప్రభుత్వ భూమి ఆక్రమణల జాబితాను బహిర్గతం చేయాలని ఆయన చేసిన విజ్ఞప్తులను యంత్రాంగం పూర్తిగా పక్కనపెట్టింది. భూకబ్జాలు, అక్రమ మైనింగ్ వంటి సున్నితమైన అంశాలపై విచారణ జరుపుతున్నప్పుడు ఆయనపై అనేక వైపుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని, ప్రజా ఫిర్యాదులను సరిగ్గా పరిష్కరించకుండా మసిపూసి మారేడుకాయ చేసేలా నివేదికలు ఇవ్వాలని బలవంతం చేశారని ఆయన ఆరోపించారు.

వ్యవస్థను ప్రశ్నిస్తున్న ఒక ఐఏఎస్ వేదన
గతంలో కూడా అనేక ప్రభుత్వ అక్రమాలను వెలికితీసి, ఎన్నో బెదిరింపులను ఎదుర్కొన్న చరిత్ర రింకూ సింగ్ రాహీకి ఉంది. నిజాయితీగా పని చేయాలనుకునే అధికారులకు వ్యవస్థ నుంచి మద్దతు లభించకపోవడం, మరోవైపు ప్రజా సమస్యలను పక్కనపెట్టాలని ఒత్తిడి చేయడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక ఉన్నతాధికారే స్వయంగా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, తన జీతాన్ని తగ్గించుకుంటానని లేఖ రాయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల పనితీరు, రాజకీయ ఒత్తిళ్లపై కొత్త చర్చకు తెరలేపింది.

Advertisement

Also Read: హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×