E-Paper
Advertisement

25 Cr in Lucky Draw: అందుకే భార్య మాట వినాలి.. ఒక్కరోజులో రూ.25 కోట్లు.. ఈ భర్త భలే లక్కీ

25 Cr in Lucky Draw: అందుకే భార్య మాట వినాలి.. ఒక్కరోజులో రూ.25 కోట్లు.. ఈ భర్త భలే లక్కీ
Advertisement

25 Cr in Lucky Draw: లక్.. లక్.. లక్ లక్కీ ఛాన్స్ అంటే మనం ఊహించని స్థితిలో అధిక ఆదాయాన్ని గడించడమే. ఇలా జీవితంలో ఎవరికైనా … ఎప్పుడో ఒకసారి వస్తుంది లక్కీ ఛాన్స్. ఆ ఛాన్స్ మిస్ చేసుకుంటే.. మళ్లీ అటువంటి ఛాన్స్ వస్తుందో.. రాదో కూడా చెప్పలేం. అందుకే అదృష్టం తలుపు తట్టినప్పుడే స్వాగతం పలకాలి. ఇక్కడ అదే జరిగింది. ఆ పేద కుటుంబానికి అదృష్టం వరించింది. ఇప్పుడు ఏకంగా కోటీశ్వరులయ్యారు ఆ దంపతులు.

సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తాపత్రయ పడుతుంటారు. ఇలా గత 15 ఏళ్లుగా తాపత్రయపడ్డ ఆ కుటుంబానికి.. దక్కిన అదృష్టం అంతా ఇంతా కాదు. అందుకే ఈ కుటుంబం సంబరాల్లో మునిగింది. అసలేం జరిగింది ? వారికి కోట్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం.

Advertisement

మైసూర్ కు చెందిన అల్తాఫ్.. మెకానిక్ వృత్తిలో రాణిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అల్తాఫ్ కు వివాహమైంది. మెకానిక్ పనులు నిర్వహిస్తూ కుటుంబ పోషణ సాగించే.. అల్తాఫ్ కు లాటరీ టికెట్స్ కొనడం అలవాటు. అదే అలవాటుని ఏకంగా 15 ఏళ్ల పాటుగా కొనసాగిస్తున్నాడు అల్తాఫ్. అయితే ఇటీవల కేరళ తిరుఓనమ్ బంపర్ లాటరీ రెండు టికెట్లను తన ఫ్రెండ్ ద్వారా అల్తాఫ్ కొనుగోలు చేశాడు.

ఒక టికెట్ తన వద్ద ఉంచుకొని.. మరొక టికెట్ తన స్నేహితునికి ఇవ్వాలని అల్తాఫ్ అనుకున్నాడు. అప్పుడే అల్తాఫ్ సతీమణి.. ఆ టికెట్ కే అదృష్టం వరిస్తుందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. భార్య మాట విన్న భర్తగా అల్తాఫ్… రెండో టికెట్ ను స్నేహితునికి ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకున్నాడు.

Advertisement

Also Read: Glowing Skin Tips: మీ ఫేస్ అందంగా కనిపించాలా ? ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

ఇక లాటరీ తీసే సమయం రానే వచ్చింది. ఏదైతే తన స్నేహితుడికి ఇవ్వాలని భావించిన టికెట్ కు.. ఏకంగా అక్షరాల రూ. 25 కోట్ల రూపాయల బహుమతి దక్కింది. కేవలం వెయ్యి రూపాయలతో 2 టికెట్లు కొనుగోలు చేసిన అల్తాఫ్ బంపర్ లాటరీ తగలడంతో.. ఆ ఇంత ఆనందం వెల్లివిరిసింది. చిన్నపాటి మెకానిక్ గా జీవనం సాగిస్తున్న అల్తాఫ్ కు రూ. 25 కోట్ల మేర లాటరీ తగలడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.

అయితే భార్య మాట వినకుండా అల్తాఫ్ తన స్నేహితునికి టికెట్ అందించి ఉంటే మాత్రం.. ఆ అదృష్టం అతని స్నేహితునికి దక్కేది. భార్య మాట విన్నందుకే అల్తాఫ్.. నేడు ఏకంగా కోటీశ్వరుడయ్యాడని చెప్పవచ్చు. అందుకే అంటారేమో పెళ్ళాం చెబితే వినాలని. మరి మీరు కూడా మీ భార్య మాట వినండి.. అదృష్టం మీకు ఎప్పుడో ఒకసారి వరిస్తుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×