E-Paper
Advertisement

Fire Accident: అగ్ని ప్రమాదాల్లో.. భారీ ఆస్తి నష్టం..?

Fire Accident: అగ్ని ప్రమాదాల్లో..  భారీ ఆస్తి నష్టం..?
Advertisement

Fire Accident in UP: ఉత్తరప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘజియాబాద్‌ ఖోడా ప్రాంతంలోని ఓ గోడౌన్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలం నుంచి దట్టపైన పొగ చుట్టూ ఉన్న ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేస్తున్నారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న ఛీప్ ఫైర్ ఆఫీసర్ రాహుల్ మంటలను అదుపు చేసేందుకు తమ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. సమాచారం అందిన వెంటనే.. వైశాలి ఫైర్ స్టేషన్ నుంచి 3 ఫైర్ సిబ్బంది బృందాలతో పాటు, సాహిబాబాద్ స్టేషన్ నుంచి 2, కొత్వాలి నుంచి రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read:మండువేసవిలో మంచువర్షం.. కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు

పశ్చిమబెంగాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. హల్దియా సూపర్ మార్కెట్ ప్రాంతంలో పలు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో దుకాణాల్లో ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షాట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×