E-Paper
Advertisement

Kota Hostel Fire Accident: కోట హాస్టల్ లో భారీ అగ్నిప్రమాదం!

Kota Hostel Fire Accident: కోట హాస్టల్ లో భారీ అగ్నిప్రమాదం!
Advertisement

Fire Accident in Kota Boys Hostel in Rajasthan: రాజస్థాన్ లోని కోటాలో గల ఒక బాలుర హాస్టల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఒక ట్రాన్స్ ఫార్మర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 8 మంది విద్యార్థులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కున్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటలో ల్యాండ్ మార్క్ సిటీలో జరిగిందీ ఘటన.

ఐదు అంతస్తుల హాస్టల్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి.. ఘటనకు గల పూర్తి కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులు గాయపడగా.. వారిలో ఒకరికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. హాస్టల్ లో ఉన్న విద్యార్థులను మరో హాస్టల్ కు తరలించారు. 8 మంది విద్యార్థుల్లో ఆరుగురు చికిత్స పొంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇద్దరు మాత్రం ఇంకా చికిత్స పొందుతున్నారు.

Advertisement

Also Read: ఎన్నికల వేళ, 1425 కేజీల బంగారం సీజ్, ఎక్కడ?

ప్రమాద సమయంలో భవనంలో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలను చూసిన ఒక విద్యార్థి మొదటి అంతస్తు నుంచి దూకడంతో.. అతనికి కాలు ఫ్రాక్చర్ అయింది. హాస్టల్ భవనంలో అగ్నిమాపక భద్రతా చర్యలు లేవని, అగ్నిమాపక ఎన్‌ఓసి కూడా లేదని పోలీసులు గుర్తించారు. హాస్టల్ భవనంలో ఇంత పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయకూడదని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైన ఫైర్ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు కోట ఏఎస్పీ అమృత దుహానీ తెలిపారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×