E-Paper
Advertisement

Digital Census-2026: దేశంలో రెండు దశల్లో జనాభా లెక్కింపు, ఏప్రిల్ ఒకటి నుంచి మొదలు, కులగణన కూడా

Digital Census-2026: దేశంలో రెండు దశల్లో జనాభా లెక్కింపు, ఏప్రిల్ ఒకటి నుంచి మొదలు, కులగణన కూడా
Advertisement

Digital Census-2026: చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకు సిద్ధమైంది కేంద్రప్రభుత్వం. తొలిసారిగా డిజిటల్‌ పద్ధతిలో జనాభా లెక్కింపును నిర్వహించనుంది. అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన నాలుగు అత్యాధునిక డిజిటల్‌ యాప్‌లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. దానితోపాటు పోర్టల్స్‌, మస్కట్‌లను లాంఛనంగా ఆవిష్కరించారు.

దేశంలో రెండు దశల్లో జనాభా లెక్కింపు, అంతా రెడీ

Advertisement

అయితే జనాభా లెక్కింపు రెండు దశల్లో జరగనుంది. దీనితోపాటు కులగణన కూడా చేస్తోంది. జనగణన లెక్కింపు ప్రక్రియ రెండు దశల్లో నిర్వహిస్తోంది కేంద్రం. ఇళ్ల వివరాలు సేకరించే మొదటి దశ ఈ ఏడాది వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 మధ్య జరగనుంది. అయితే రాష్ట్రాల వెసులుబాటు బట్టి నెల రోజులపాటు జరుగుతుంది. ఇక వ్యక్తుల వివరాలు సేకరించే రెండో దశ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా మొదలు కానుంది.

రెండో దశలో కులగణన వివరాలు సేకరిస్తారు. జనాభా లెక్కలకు 2027 మార్చి ఒకటి నుంచి నిర్ణయించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అంటే మంచు ప్రభావం ఉండే లడఖ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి సర్వేను పూర్తి కానుంది.

Advertisement

ఏప్రిల్ ఒకటి నుంచి మొదలు, కులగణన కూడా

జనాభా లెక్కల సేకరణకు దాదాపు 30 లక్షల మంది సిబ్బంది రంగంలోకి దిగనున్నారు. ఈసారి యాప్‌ల ద్వారా ఆఫ్‌లైన్‌లో సిబ్బంది డేటాను సేకరించనుంది. ఈసారి ప్రజలకు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ సౌకర్యాన్ని కల్పించింది కేంద్రం. ఎన్యుమరేటర్‌ ఇంటికి రాకపోయినా ప్రజలు తమ స్మార్ట్‌ ఫోన్ల ద్వారా చేసుకోవచ్చు.

16 ప్రాంతీయ భాషల్లో కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సదుపాయం ఉంది. ఆ తర్వాత వచ్చే ప్రత్యేక ఐడీని ఎన్యుమరేటర్‌‌కి చూపిస్తే సరిపోతుందని తెలిపింది. శాటిలైట్‌ మ్యాప్‌ల ద్వారా భౌగోళికంగా డిజిటల్‌ బ్లాక్‌ల రూపకల్పన, ఎన్యుమరేటర్లు నేరుగా డేటాను సర్వర్‌కు పంపేందుకు మొబైల్‌ యాప్‌ సహాయపడనుంది.

ALSO READ: అస్సాంలో కూలిన యుద్ధ విమానం.. కొండలో భారీ పేలుడు శబ్దం

ప్రజలు నేరుగా తమ వివరాలు నమోదు చేసుకునే వెబ్‌సైట్‌‌లో అధికారులంతా ఎప్పటికప్పుడు సర్వే పురోగతిని పర్యవేక్షించవచ్చు. జనగణన ప్రక్రియలో స్త్రీ-పురుషుల సమాన భాగస్వామ్యానికి ప్రతీకగా మహిళా ఎన్యుమరేటర్‌ను ప్రగతిగా, పురుష ఎన్యుమరేటర్‌ను వికాస్‌గా నామకరణం చేస్తూ మస్కట్‌లను విడుదల చేశారు హోంమంత్రి అమిత్ షా.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×