// // Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లో హిందువుల నెత్తుటి ఏరులు.. బెంగాల్‌కూ ఆ మంటలు పాకుతున్నాయా? -->
E-Paper
Advertisement

Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లో హిందువుల నెత్తుటి ఏరులు.. బెంగాల్‌కూ ఆ మంటలు పాకుతున్నాయా?

Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లో హిందువుల నెత్తుటి ఏరులు.. బెంగాల్‌కూ ఆ మంటలు పాకుతున్నాయా?
Advertisement

Bangladesh Hindus: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని అక్కడి మత ఛాందసవాద అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. కనిపిస్తే చాలు దాడులకు తెగబడుతూ, ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా జరిగిన ఒక హృదయ విదారక ఘటనలో, 25 ఏళ్ల హిందూ యువకుడు మిథున్ సర్కార్‌ను ఓ ఉన్మాద గుంపు కిరాతకంగా హత్య చేసింది. అల్లరి మూకల దాడి నుంచి తప్పించుకునేందుకు, తనను తాను రక్షించుకునేందుకు ఆ యువకుడు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ గుంపు అతడిని వెంబడించి మరీ పొట్టనబెట్టుకుంది.

ఈ ఘ‌ట‌న‌పై బెంగాల్ లో బీజేపీ నేత‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 25 ఏళ్ల హిందూ యువకుడు మిథున్ సర్కార్‌ను ఓ ఉన్మాద గుంపు కిరాతకంగా హత్య చేసిందని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదికగా ఆందోళ‌న చెందింది. అల్లరి మూకల దాడి నుంచి తప్పించుకునేందుకు, తనను తాను రక్షించుకునేందుకు ఆ యువకుడు ఎంత ప్రయత్నించిన, ఆ గుంపు అతడిని వెంబడించి మరీ పొట్టనబెట్టుకుందని పేర్కోంది. గడిచిన మూడు వారాల వ్యవధిలోనే ఏడుగురు హిందూ పురుషులు హత్యకు గురయ్యారంటే అక్కడి పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని తెలిపింది.

Advertisement

బంగ్లాదేశ్‌లో హిందువులను అక్షరాలా వేటాడుతున్నారు. అంతేకాకుండా, ఓ హిందూ మహిళపై ముస్లింలు అత్యాచారానికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచింది. ఇవన్నీ యాదృచ్చికంగా జరుగుతున్నవి కావని, ప్రణాళికాబద్ధంగా హిందువులను అంతం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ పరిణామాల ప్రభావం కనిపిస్తోంది. మమతా బెనర్జీ పాలనలో బెంగాల్‌లో కూడా హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, బంగ్లాదేశ్ సంస్కృతి ఇక్కడికి పాకిందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మ‌రోవైపు, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న వరుస దాడులు, హత్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 25 ఏళ్ల హిందూ యువకుడు మిథున్ సర్కార్ హత్య, మహిళలపై అత్యాచారాలు, దేవాలయాల ధ్వంసం వంటి ఘటనలు జరుగుతున్నా భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు బలమైన ప్రకటన రాకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×