// // Child Tied to Railing Video:జామకాయ దొంగలించిందన్న పాపానికి.. ఒక చిన్నారిని కట్టేసి హింసించిన దుర్మార్గుడు -->
E-Paper
Advertisement

జామకాయ దొంగలించిందన్న పాపానికి.. ఒక చిన్నారిని కట్టేసి హింసించిన దుర్మార్గుడు

జామకాయ దొంగలించిందన్న పాపానికి.. ఒక చిన్నారిని కట్టేసి హింసించిన దుర్మార్గుడు
Advertisement

Child Tied to Railing Video: హిమాచల్ ప్రదేశ్‌లోని ఊనా జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం తన చెట్టు నుంచి జామకాయలు కోసిందన్న కార‌ణంతో, ఒక వ్యక్తి చిన్నారిని మెట్ల రెయిలింగ్‌కు కట్టివేసి క్రూరంగా హింసించాడు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక వలస కార్మిక కుటుంబానికి చెందిన 5-6 ఏళ్ల బాలికను, ఒక మాజీ సైనికుడు తన ఇంటి మెట్ల రెయిలింగ్‌కు తాళ్లతో బలంగా కట్టివేశాడు. ఆ చిన్నారి భయంతో వణుకుతూ, ఏడుస్తూ “నన్ను వదిలేయండి అంకుల్.. కాపాడండి.” అని వేడుకుంటున్నా ఆ వ్యక్తి కనికరించలేదు. వీడియో తీస్తున్న వారు ప్రశ్నించగా, తన చెట్టు జామకాయలు కోసిందని, అందుకే శిక్ష వేస్తున్నానని దురుసుగా సమాధానం ఇచ్చాడు. ఒక చిన్న తప్పుకు పసిపాపను అలా బంధించడం మానవత్వానికే మాయని మచ్చ అని నెటిజన్లు మండిపడుతున్నారు.

Advertisement

ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో హిమాచల్ ప్రదేశ్ పోలీసులు.. స్థానిక యంత్రాంగం తక్షణమే స్పందించారు. నిందితుడిపై బాలల వేధింపుల నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక చిన్నారిని నిర్బంధించి హింసించినందుకు గాను అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులు ఆదేశించారు. బాధితురాలు వలస కుటుంబానికి చెందినది కావడంతో, వారికి అవసరమైన రక్షణ.. వైద్య సాయం అందించేలా చర్యలు చేపట్టారు.

మ‌రోవైపు ఈ ఘటనపై ప్రజా సంఘాలు.. స్వచ్ఛంద సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సమాజంలో పిల్లల పట్ల ఇలాంటి క్రూరత్వం పెరగడం ఆందోళనకరమని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Read Also: కానిస్టేబుల్ కళ్ళముందే దారుణం.. భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×