E-Paper
Advertisement

Mumbai Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు.. స్తంభించిన జనజీవనం

Mumbai Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు.. స్తంభించిన జనజీవనం
Advertisement

Mumbai Rains: భారీ వర్షాలు ముంబైని ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసి ముద్దవుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం 8 గంటల వరకు 24 గంటల్లోనే ముంబైలోని చాలా ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షాపాతం నమోదైనట్లు బృహన్ ముంబై మున్సినల్ కార్పొరేషన్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ వెల్లడించింది. అంతే కాకుండా ట్రాంబేలో 241 మిల్లీ మీటర్ల గరిష్ట వర్షాపాతం నమోదైట్లు తెలిపింది.

వడాలాలో 223 మి.మీ,ఘట్ కోపర్‌లో 215 మి.మీ, వర్లీలో 204 మి.మీ, సెవ్రిలో 203 మి.మీ, బీకేసీలో 199 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైనట్లు తెలిపింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబైలో అధికారులు హై టైడ్ అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. మరో వైపు కుండపోత వర్షాలకు మహా నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి.

Advertisement

ఇవాళ కూడా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని నవీ ముంబై మున్సినపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వాహణ విభాగం సూచించింది. ఇక భారీ వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రైళ్లు విమానల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Advertisement

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×