E-Paper
Advertisement

Hemant Soren govt wins: బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సర్కార్, విపక్షాలు వాకౌట్..

Hemant Soren govt wins: బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సర్కార్, విపక్షాలు వాకౌట్..
Advertisement

Hemant Soren govt wins: ఎట్టకేలకు జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి గండం గడిచింది. సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో హేమంత్ సర్కార్ విజయం సాధించింది. మొత్తం 81 మంది ఎమ్మెల్యేలకు.. 45 మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. అయితే ఓటింగ్ జరుగుతున్న సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి.

జార్ఖండ్‌ అధికార కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యులు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నారు. విపక్ష కూటమికి కేవలం 30 మంది మాత్రమే సభ్యులున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు .. ఎంపీగా ఎన్నిక కావడంతో అసెంబ్లీలో సంఖ్యాబలం 76కు పడిపోయింది. దీంతో మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కేవలం 39 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. హేమంత్ ప్రభుత్వానికి అనుకూలంగా 45 ఓట్లు వచ్చాయి.

Advertisement

ల్యాండ్ స్కామ్ కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆయన తన పదవికి రాజీనామా తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత జార్ఖండ్ సీఎంగా చంపయి సోరెన్ బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఐదు నెలల తర్వాత మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం చంపయి సోరెన్ రాజీనామా చేశారు.

ముచ్చటగా మూడోసారి హేమంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులోభాగంగా సోమవారం అసెంబ్లీలో ఆయన బలపరీక్షలో నెగ్గారు. ఆయన కేబినెట్‌లోకి కల్పనా సోరెన్‌ను తీసుకునే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

Advertisement

ALSO READ: శివసేన నాయకుడి కుమారుడు కారు నడుపుతున్నట్లుగా సీసీటీవి వీడియో!

బలపరీక్షలో విజయం సాధించిన తర్వాత మీడియాతో మాట్లాడారు సీఎం హేమంత్ సోరెన్. 2019 నుంచి తాము రాజ్యాంగ పద్దతి ప్రకారమే నడుస్తున్నామని గుర్తు చేశారు. ఇవాళ అధికార పార్టీ బలాన్ని చూశారని, స్పీకర్, పార్టీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×