E-Paper
Advertisement

Helicopter Crashes: అరేబియా సముద్రం.. కూలిన హెలికాప్టర్.. ఏం జరిగింది?

Helicopter Crashes: అరేబియా సముద్రం.. కూలిన హెలికాప్టర్.. ఏం జరిగింది?
Advertisement

Helicopter Crashes: ఇండియన్ కోస్ట్ గార్డుకి చెందిన హెలికాప్టర్ ఒకటి అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు సేఫ్ కాగా, మరో ముగ్గురు గల్లంతు అయినట్టు అధికారులు వెల్లడించారు. అయితే
హెలికాఫ్టర్ కూలిపోవడానికి ముందు అసలేం జరిగింది? అన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.

గుజరాత్ పోర్‌బందర్‌ తీరానికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ కూలిపోయింది. అరేబియా సముద్రంలో ఉన్న మోటార్ ట్యాంకర్‌లో ఉన్న సిబ్బందికి గాయమైంది. వెంటనే ట్యాంకర్ నుంచి కోస్టుగార్డు ఆఫీసుకు ఎమర్జెన్సీ సందేశం వెళ్లింది. గాయపడిన వ్యక్తిని తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ వస్తోంది.

Advertisement

ALSO READ: తీవ్ర విషాదం.. ట్రాక్టర్ ట్రాలీ బోల్తా ..నలుగురు దుర్మరణం

టెక్నాలజీతో కూడిన తేలికపాటి హెలికాప్టర్. అది కోస్టుగార్డు ఆఫీసు నుంచి బయలుదేరింది. సోమవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత హెలికాప్టర్‌లో చిన్నపాటి సమస్య తలెత్తింది. దీంతో సముద్రంపై ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాలని భావించాడు పైలట్. ఈ క్రమంలో చాపర్ కుప్పకూలిపోయింది. ఘటన సమయంలో అందులో నలుగురు సిబ్బంది ఉన్నారు.

Advertisement

హెలికాప్టర్‌తో సిగ్నల్ తెగిపోవడంతో అప్రమత్తమైన కోస్ట్‌గార్డు సిబ్బంది రంగంలోకి దిగారు. హెలికాప్టర్ కూలిన ప్రదేశంలో చేరుకున్నారు. దాని శకలాలను గుర్తించారు. అందులో ఓ వ్యక్తిని కాపాడారు. మరో ముగ్గురు గల్లంతు అయ్యారు. వారి కోసం నేవీ నౌకలు రంగంలోకి దిగాయి.

ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని నేవీ బృందాలు గాలిస్తున్నారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఇటీవల గుజరాత్ వర్షాల సమయంలో దాదాపు 70 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంతలో కూలిపోవడంతో అధికారులకు అర్థం కాలేదు. ఘటనపై విచారణ జరుగుతోంది.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×