E-Paper
Advertisement

BholeBaba statment: హాత్రాస్ ఘటన తర్వాత.. మీడియాతో భోలేబాబా.. ఆ నాలుగు మాటలు

BholeBaba statment: హాత్రాస్ ఘటన తర్వాత.. మీడియాతో భోలేబాబా.. ఆ నాలుగు మాటలు
Advertisement

BholeBaba statment: ఉత్తరప్రదేశ్‌లో హాత్రాస్ ఘటన తర్వాత భోలే బాబా కనిపించకపోవడంపై రకరకాల వార్తలు వచ్చాయి. పరిస్థితి గమనించిన బాబా నేరుగా మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేశారు. ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు తనకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

భోలెబాబా అలియాస్ సూరజ్‌పాల్ సింగ్ గురించి ఈ మధ్య రకారకాలు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వందల కొద్దీ ఆస్తులు కూడబెట్టారని, ఆయనకు ప్రత్యేకంగా ప్రైవేటు సెక్యూరిటీ, కాన్వాయ్ వంటి వ్యవహారా లు బయటపడిన నేపథ్యంలో ఓ న్యూస్ ఏజెన్సీతో నేరుగా మాట్లాడారాయన.

Advertisement

హాత్రాస్‌లో జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు భోలే బాబా. ఇలాంటి సమయంలో ఆ బాధను భరించే శక్తిని భగవంతుడు తనకు ఇవ్వాలన్నారు. ఘటనకు కారణమైన వారు శిక్ష నుంచి తప్పించు కోలేరని, ఈ విషయంలో తనకు ప్రభుత్వంపై నమ్మకం ఉందన్నారు. మృతులు, గాయపడిన కుటుంబా లకు అండగా ఉండాలని కమిటీ సభ్యులకు చెప్పినట్టు వెల్లడించారు.

ఈ ఘటనకు కారణమైన ఈవెంట్ ఆర్గనైజర్, ప్రధాన నిందితుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాట ఘటనలో మధుకర్ పేరును చేర్చుతూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారం తర్వాత మధుకర్ కనిపించకుండాపోయాడు. శుక్రవారం మధుకర్ పోలీసులకు లొంగిపోవడం, శనివారం బాబా మీడియా ముందు రావడం అంతా చకచకా జరిగిపోయాయి.

Advertisement

ALSO READ: రేఖాశర్మపై కామెంట్స్, బుక్కైన ఎంపీ మహువా మొయిత్రా

జూలై రెండున హాత్రాస్‌లో సత్సంగ్ పేరుతో భోలేబాబా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. దీనికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఘటన జరిగిన రోజు దాదాపు రెండున్నర లక్షల మంది హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏ జరిగిందో తెలీదుగానీ, ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. 121 మంది మృత్యువాతపడ్డారు. గాయపడినవారు అదే రేంజ్‌లో ఉన్నారు.

 

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×