E-Paper
Advertisement

H1-B Visa: టెక్కీలకు అమెరికా షాక్.. అప్ప‌టి వరకు హెచ్1బీ ఇంటర్వ్యూలు వాయిదా..!

H1-B Visa: టెక్కీలకు అమెరికా షాక్.. అప్ప‌టి వరకు హెచ్1బీ ఇంటర్వ్యూలు వాయిదా..!
Advertisement

H1-B Visa: అమెరికాలో ఉద్యోగ కలలు కంటున్న వేలాది మంది భారతీయ వృత్తి నిపుణులకు భారీ షాక్ తగిలింది. హెచ్1బీ (H1-B) వీసా ప్రక్రియపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దరఖాస్తుదారులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. భారత్‌లో నిర్వహించాల్సిన హెచ్1బీ వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలను అమెరికా ఏకంగా 2027వ సంవత్సరానికి వాయిదా వేసింది. దీనివల్ల కొత్తగా వీసాల కోసం ఎదురుచూస్తున్న వారే కాకుండా, ఇప్పటికే అమెరికాలో ఉండి స్టాంపింగ్ కోసం స్వదేశానికి రావాలనుకుంటున్న వారు కూడా ఇక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఏర్పడింది.

గతేడాది డిసెంబర్‌లో ట్రంప్ సర్కార్ హెచ్1బీ వీసా నిబంధనల్లో కీలక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలనే నిబంధనను కఠినతరం చేసింది. ఈ కొత్త విధానాల అమలు మరియు పెండింగ్‌లో ఉన్న పాత దరఖాస్తుల భారం కారణంగా ఇంటర్వ్యూ స్లాట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పెండింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాతే కొత్త వారికి అవకాశం లభిస్తుంది. దీంతో భారత్‌లోని ఎంబసీల్లో ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది ఏప్రిల్–మే నెలల వరకు, మరికొన్నింటిని 2027 వరకు వాయిదా వేస్తున్నట్లు సమాచారం.

Advertisement

ప్రస్తుతం ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లోని అమెరికా కాన్సులేట్లలో హెచ్1బీ వీసా ఇంటర్వ్యూ స్లాట్లు పూర్తిగా నిండిపోయాయి. మొత్తం ప్రక్రియ దాదాపు 18 నెలల వరకు వాయిదా పడటంతో, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలో ప్రస్తుతం పని చేస్తున్న భారతీయులకు వారి కంపెనీలు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప భారత్‌కు రావద్దని, ఒకవేళ వస్తే స్టాంపింగ్ దొరక్క మళ్లీ అమెరికా వెళ్లడం అసాధ్యమవుతుందని ఇమిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ అనూహ్య నిర్ణయం వల్ల వేలాది మంది టెక్కీల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఒకవైపు కంపెనీల ఒత్తిడి, మరోవైపు వీసా ఇంటర్వ్యూల జాప్యంతో భారతీయ ఐటీ రంగ నిపుణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Read Also: Padma Shri 2026: పద్మ అవార్డులు 2026 ప్రకటన.. తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మశ్రీ.. జాబితాలో 45 మంది సామాన్య వీరులు!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×