E-Paper
Advertisement

పెళ్లి సర్టిఫికెట్ ఉంటే సరిపోదు.. అవి కూడా ఉండాల్సిందే.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

పెళ్లి సర్టిఫికెట్ ఉంటే సరిపోదు.. అవి కూడా ఉండాల్సిందే.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
Advertisement

Gujarat High Court: మ్యారేజ్ సర్టిఫికేట్ అడ్డుపెట్టుకొని పెళ్లి పేరుతో డ్రామాలు ఆడిన యువతికి గుజరాత్ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రం ఉంటే సరిపోదని.. పెళ్లిలో హిందూ సాంప్రదాయాలు కూడా ముఖ్యమేనని వ్యాఖ్యానించింది. వాటిని పాటించనందున హిందూ వివాహ చట్టం ప్రకారం.. ఆ పెళ్లి చెల్లదని సంచలన తీర్పును వెలువరించింది.

అసలేం జరిగిందంటే?

ఉపాధి, ఉన్నత చదువుల కోసం అహ్మదాబాద్‌కు చెందిన ఒక యువకుడు యూకేకి వెళ్లాడు. అక్కడ అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న సమయంలో అతనికి ఊహించని షాక్ ఎదురైంది. అతడి యజమాని కుమార్తె పెళ్లి డ్రామాకు తెరతీసింది. నేరుగా అహ్మదాబాద్ లోని యువకుడి ఇంటికి వెళ్లి.. వారిద్దరికీ వివాహమైందంటూ మ్యారేజ్ సర్టిఫికెట్‌ చూపించింది. తామిద్దరం చట్టబద్ధంగా భార్యాభర్తలమని నమ్మించే ప్రయత్నం చేసింది.

మోసపూరితంగా సంతకాలు

Advertisement

అయితే, తాను ఆమెను ఎప్పుడూ వివాహం చేసుకోలేదని, తమ మధ్య హిందూ ఆచార సంప్రదాయల ప్రకారం ఎలాంటి క్రతువులు జరగలేదని యువకుడు పేర్కొన్నాడు. ఆమె తండ్రి కంపెనీలో పనిచేస్తున్న సమయంలో తనకు తెలియకుండానే మోసపూరితంగా సంతకాలు సేకరించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. అయితే ఈ వ్యవహారం అహ్మదాబాద్ లోని ఫ్యామిలీ కోర్టుకెళ్లగా.. సదరు యువతి లిఖిత పూర్వకంగా అసలు విషయాన్ని వెల్లడించింది.

యువతి ఏం చెప్పిందంటే?

సదరు యువకుడితో చట్టబద్దమైన వివాహ బంధం ఏదీ లేదని ఆమె ఫ్యామిలీ కోర్టుకు తెలిపింది. తాము భార్యాభర్తలుగా కలసి జీవించలేదని ఒప్పుకుంది. నిజాన్ని ఆమెనే స్వయంగా ఒప్పుకున్న నేపథ్యంలో సదరు మ్యారేజ్ సర్టిఫికేట్ ను రద్దు చేసి.. ఆ ప్రాతిపదికన తీర్పు ఇవ్వాలని 2025 నవంబర్ 13న ఫ్యామిలీ కోర్టును కోరాడు. అయితే అనూహ్యంగా ఇందుకు ఫ్యామిలీ కోర్టు అంగీకరించలేదు. అతడి పిటిషన్ ను కొట్టివేసింది.

హైకోర్టు సంచలన తీర్పు

Advertisement

ఫ్యామిలీ కోర్టు తీర్పుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ బాధితుడి పక్షాన న్యాయవాది రాహి అతనికి న్యాయవాది రాహిల్ పి. జైన్ (7305) తరఫున బలమైన వాదనలు వినిపించారు. బాధితుడి తరఫున దాఖలైన ఆధారాలు.. ప్రతివాది అంగీకార పత్రాన్ని పరిశీలించిన హైకోర్టు.. జూన్ 23న సంచలన తీర్పును వెలువరించింది. బాధితుడికి అనుకూలంగా తీర్పునిస్తూ గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Also Read: ఏంటీ.. రూ.350 లోపే అపరిమిత 5G డేటానా? ఈ Airtel ప్లాన్స్‌తో రచ్చ రచ్చే!

సర్టిఫికేట్ ఉంటే సరిపోదు..

హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం అవసరమైన సాంప్రదాయ క్రతువులు, ఆచారాలు జరగనంత వరకు ఏ వివాహమూ చట్టబద్ధం కాదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం సెక్షన్ 8 కింద పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన.. ప్రాథమిక విధివిధానాలు లేని వివాహానికి చట్టబద్ధత రాదని తేల్చి చెప్పింది. హిందూ వివాహ సంప్రదాయాలు (తాళి కట్టడం, ఏడు అడుగులు నడవటం వంటివి) ప్రకారం తమ పెళ్లి జరగలేదని యువతి స్వయంగా అంగీకరించిన నేపథ్యంలో.. ఆ వివాహానికి ఏమాత్రం చట్టబద్దత లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. చివరికీ ఆ పెళ్లిని రద్దు చేస్తూ బాధితుడి పక్షాన ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: నోకియా కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 19 రోజులు నాన్ స్టాప్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×